ETV Bharat / state

తెలంగాణలో బీఆర్​ఎస్​ ఓటమి​ - ఏపీలోనూ వైసీపీ పని అంతేనంటున్న ప్రతిపక్షాలు

Telangana Election Results 2023: తెలంగాణ ఎన్నికల ఫలితాలలో కాంగ్రెస్​ విజయకేతనం ఎగరవేయడంపై సీపీఐ, సీపీఎం, కాంగ్రెస్​ నాయకులు హర్షం వ్యక్తం చేశారు. ఈ ఫలితాల ప్రభావం ఏపీలో జరగబోయే ఎన్నికల మీద పడుతుందని అన్నారు. కేసీఆర్​ను గద్దె దించినట్టే జగన్​ను కూడా గద్దె దించడానికి ప్రజలు సిద్దంగా ఉన్నారని అన్నారు.

ap_politicians_on_congress_victory
ap_politicians_on_congress_victory
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Dec 3, 2023, 7:47 PM IST

CPI, CPM and Congress Leaders on Congress Victory in Telangana Elections: బీఆర్​స్​ను అధికారంలోకి తీసుకురావడానికి సీఎం జగన్ మోహన్ రెడ్డి ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫలించలేదని సీపీఐ జాతీయ కార్యదర్శి కె. నారాయణ విమర్శించారు. తెలంగాణాలో అధికారం చేపట్టబోయే కాంగ్రెస్​కు ముందుగా శుభాకాంక్షలు తెలియజేశారు. తమ పార్టీ కార్యదర్శి కూనంనేని సాంబశివరావు గెలుపునకు కృషి చేసిన కొత్తగూడెం ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. మేము అడిగిన స్థానాలు ఇవ్వడానికి కాంగ్రెస్ నిరాకరించినా దేశ రాజకీయ పరిస్థితుల దృష్టిలో పెట్టుకుని కాంగ్రెస్​తో కలసి ముందుకెళ్లామన్నారు. మిగిలిన నాలుగు రాష్ట్రాల్లో కాంగ్రెస్ ఓటమికి ఆ పార్టీ చేసుకున్న తప్పిదాలే కారణమన్నారు. తెలంగాణ మాదిరిగా ఇతర రాష్ట్రాల్లో యువతను ప్రోత్సహించలేదని విమర్శించారు.

వై నాట్ ఆంధ్రా ! కాంగ్రెస్‌ నెక్ట్స్‌ టార్గెట్‌ జగనేనా ? వైసీపీ నేతల్లో గుబులు

CPI State Secretary Ramakrishna: రాష్ట్రంలో ప్రజా వ్యతిరేక విధానాలు అవలంభిస్తున్న వైసీపీని రానున్న ఎన్నికల్లో ఓడించడానికి తెలుగుదేశంతో కలసి పని చేస్తామని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ మరోసారి స్పష్టం చేశారు. ఇప్పటికే లౌకిక, ప్రజాస్వామ్య శక్తులతో చర్చలు జరుపుతున్నామని తెలిపారు. వచ్చే శాసన సభ ఎన్నికల్లో వైకాపాను ఇంటికి పంపించటానికి రాష్ట్రప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు.

Telangana Women MLAs List : తెలంగాణ ఎన్నికల ఫలితాల్లో మహారాణులు వీరే - ఎంతమంది మహిళలు గెలిచారో తెలుసా?

CPM Central Committee Member Ghafoor: తెలంగాణలో బీఆర్​ఎస్​ పార్టీ ఎలాగైతే ఓటమిని చవి చూసిందో రాబోయే ఎన్నికల్లో ఏపీలో కూడా జగన్మోహన్ రెడ్డి సర్కార్ ఓటమిని చవి చూస్తుందని సీపీఎం కేంద్ర కమిటీ సభ్యులు గఫూర్ స్పష్టం చేశారు. తెలుగుదేశం పార్టీ ఇప్పటికైనా మేల్కొనాలి లేదంటే రాబోయే ఎన్నికల్లో సమస్యలు తప్పవని బీజేపీతో పొత్తు పెట్టుకోకుండా ఒంటరిగా పోటీ చేస్తే ప్రజలు స్వాగతిస్తారని అన్నారు. తెలంగాణలో కేసీఆర్ కాస్త అభివృద్ధి చేసినప్పటికీ ప్రజలు మాత్రం ఆయనను వ్యతిరేకించడానికి కారణం ఆయన బీజేపీతో పొత్తు పెట్టుకోవడంతో పాటు ఆయన అహంకార తత్వమేనని పేర్కొన్నారు. రాష్ట్రాన్ని జగన్మోహన్ రెడ్డి గాలికి వదిలేసారని కడప జిల్లా మొత్తం కరువుతో అల్లాడుతుంటే ఒక్క కరువు మండలాన్ని కూడా ప్రకటించకపోవడం దారుణమని ఖండించారు. ప్రజలు చాలా విలువైన వారని అన్నీ గమనిస్తున్నారని కేవలం ఉచితాలు ఇచ్చినంత మాత్రాన అధికారంలోకి రారనే విషయం స్పష్టమైందని అన్నారు.

కాంగ్రెస్​ను విజయతీరాలకు నడిపించిన మాస్టర్​ మైండ్​ ఎవరిది? ఆయన సక్సెస్​ మంత్ర తెలుసా?

APCC Media chairman Tulasi Reddy: తెలంగాణా అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ విజయం దుందుబి మోగించడం పట్ల కాంగ్రెస్ పార్టీ హర్షం వ్యక్తం చేస్తుందని ఏపీసీసీ మీడియా చైర్మన్ తులసి రెడ్డి అన్నారు. తెలంగాణ ఎన్నికల ప్రభావం ఏపీలో జరగబోయే ఎన్నికల మీద ఉంటుందని అన్నారు. 2 తెలుగు రాష్ట్రాలలో సమైక్య ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీకి కంచుకోటలా ఉండేదని అన్నారు. ఈ రోజు తెలంగాణ ఎన్నికల చూసిన తర్వాత ఈ రెండు రాష్ట్రాల్లో కూడా గత వైభవం రాబోతోందని నమ్మతున్నానని అన్నారు.. తెలంగాణ ఎన్నికల ఫలితాలు చూశాక చరిత్ర పునరావృతం అవుతుందని నమ్ముతున్నానని అన్నారు. ఈ ఫలితాలు చూశాక ఏపీ సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీని ఓడించి జగన్​ను సీఎం పదవి నుంచి దింపి కాంగ్రెస్ పార్టీ వస్తుందని తులసి రెడ్డి అన్నారు. వచ్చే ఎన్నికల్లో మా నినాదం ఒకటే - 'నిన్న కర్ణాటక, నేడు తెలంగాణా, రేపు ఆంధ్రప్రదేశ్' - ఇదే కాంగ్రెస్ నినాదం అని తులసి రెడ్డి తెలిపారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.