ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేస్తూ.. గుంటూరు కలెక్టరేట్ వద్ద గత రెండు రోజులుగా కొవిడ్ వారియర్స్ ఆమరణ నిరాహారదీక్ష చేపట్టారు. నిరసనకారులను పోలీసులు జీజీహెచ్‌కు తరలించగా.. అక్కడే బైఠాయించి వారు ఆందోళనకు దిగారు. ఆందోళన చేస్తున్న కొవిడ్ వారియర్స్‌ను అరెస్ట్ చేసి పోలీసు స్టేషన్‌కి తరలించారు. ప్రాణాలను ఫణంగా పెట్టి, కరోనా సమయంలో విధులు నిర్వహించిన.. తమను ఇప్పుడు తొలగించడం దారుణమని ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారుల తీరుతో.. తమ కుటుంబాలు రోడ్డున పడ్డాయని వాపోయారు. సమస్యపై ప్రభుత్వం స్పందించే వరికు దీక్ష విరమించేది లేదని స్పష్టం చేశారు.
ఇదీ చదవండి: అమరావతి ఉద్యమంలో మరో రైతు మృతి