హైకోర్టు అధీనంలో పనిచేసే కిందిస్ధాయి కోర్టుల్లో కార్యకలాపాలను రెండు రోజులపాటు సస్పెండ్ చేస్తూ హైకోర్టు రిజిస్ట్రార్ ఉత్తర్వులు జారీ చేశారు. కోవిడ్ 19 పాజిటివ్ కేసులు విజృంభిస్తున్న క్రమంలో రెండు రోజులు కార్యకలాపాలను సస్పెండ్ చేసినట్లు ఉత్తర్వుల్లో తెలిపారు. ఎవరైనా పిటిషన్ దరఖాస్తు చేయాలంటే ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. ఇప్పటికే 30వ తేదీ వరకు హైకోర్టు, విజయవాడ, మెట్రోపాలిటిన్ కోర్టుల్లో కార్యకలాపాలను సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే.
ఇదీ చదవండి: చైనా విద్యుత్ పరికరాలతో సైబర్ దాడులు!