ETV Bharat / state

నకిలీ పట్టా పాసు పుస్తకాలతో.. బ్యాంకుకు దంపతుల టోకరా..!

వారు చూపించినవి.. నకిలీ పాసు పుస్తకాలు. కానీ చూడటానికి అచ్చు అసలులాగే ఉన్నాయి. దీంతో బ్యాంకు అధికారులు మోసపోయి.. వారికి రుణం ఇచ్చారు. తీరా.. నిందితులు రుణం చెల్లించకపోవటంతో బ్యాంకు అధికారులు ఆరా తీశారు. అప్పటికి గాని తెలియలేదు.. అవి నకిలీవని. ఈ మోసపూరిత ఘటన.. గుంటూరు జిల్లా నరసరావుపేట మండలం ఉప్పలపాడులో జరిగింది.

author img

By

Published : Jan 11, 2022, 10:54 PM IST

couple cheated bank with fake pass books at narsaraopeta in guntur
నకిలీ పట్టా పాసు పుస్తకాలతో.. బ్యాంకుకు దంపతుల టోకరా..!

నకిలీ పట్టా పాసు పుస్తకాలతో.. ఓ జంట బ్యాంకును మోసం చేసిన ఘటన.. గుంటూరు జిల్లా నరసరావుపేట మండలం ఉప్పలపాడులో జరిగింది. నకిలీ పాసు పుస్తకాలతో రూ.9 లక్షలు రుణం తీసుకున్న దంపతులు.. అన్నాచెల్లెల్లమని చెప్పి చైతన్య గోదావరి గ్రామీణ బ్యాంకు నుంచి రుణం తీసుకున్నారు. అయితే.. వారు రుణం చెల్లించకపోవటంతో.. బ్యాంకు ఆరా తీయగా..నకిలీ పాసు పుస్తకాలతో రుణం తీసుకున్నట్లు గుర్తించారు. ఘటనపై.. నరసారావుపేట పోలీస్ స్టేషన్​లో బ్యాంకు మేనేజర్ ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు.. ముగ్గురు నిందితులను పట్టుకోగా.. మరో ముగ్గురి కోసం గాలిస్తున్నామన్నారు. నిందితుల వద్ద నుంచి రూ.9లక్షలు స్వాధీనం చేసుకున్నారు.

ఇదీ చదవండి:

Matrimonial Cyber Crimes : 'పెళ్లి కావాలా నాయనా'.. అంటూ లక్షలు టోకరా!

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.