రాష్ట్రంలో ప్రతి 10 లక్షల మందికి 1,504 కరోనా పరీక్షలు చేస్తున్నామని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జవహర్‌రెడ్డి వెల్లడించారు. తమిళనాడు, రాజస్థాన్ కంటే మనమే ఎక్కువ పరీక్షలు చేస్తున్నామన్నారు. అలాగే దేశవ్యాప్తంగా, ఇతర రాష్ట్రాలతో పోలిస్తే మనవద్ద పాజిటివిటీ రేటు తక్కువని తెలిపారు. దేశవ్యాప్తంగా పాజిటివిటీ రేటు 4.13 శాతంగా ఉంటే మనరాష్ట్రంలో పాజిటివిటీ రేటు 1.57 మాత్రమేనని స్పష్టం చేశారు. 80 నుంచి 90 శాతం కేసులు ఇప్పటికే ఉన్న క్లస్టర్లలోనే వస్తున్నాయని వెల్లడించారు. ఎక్కువ పరీక్షలు చేస్తున్నాం కనుకే కేసులు ఎక్కువగా వస్తున్నాయని వివరించారు. అలాగే ఏప్రిల్ 9 నుంచి 28 వరకు డబ్లింగ్ టైమ్ రేటు ఏపీలో 9.8 రోజులుగా ఉందని జవహర్‌రెడ్డి తెలిపారు. త్వరలోనే మరో 3 జిల్లాల్లో ల్యాబ్‌లు రానున్నాయని పేర్కొన్నారు.
ఇదీ చదవండి..