గుంటూరు జిల్లా సత్తెనపల్లిలో ప్రభుత్వ వైద్యుడికి కరోనా సోకింది. ఆయన కొంతకాలంగా కరోనా మొబైల్ టీమ్ ఇంఛార్జ్‌గా పని చేస్తున్నారు. ఈ క్రమంలో తనకు కొవిడ్ లక్షణాలు కనిపించటంతో స్వీయ పరీక్షలు చేసుకున్నారు. టెస్టుల్లో పాజిటివ్‌గా నిర్ధరణ కావడంతో యన్ఆర్ఐ ఆసుపత్రి ఐసోలేషన్‌కు వెళ్ళారు.
వైద్యుడు నివాసమున్న ఆపార్ట్ మెంట్‌ను మున్సిపల్ సిబ్బంది సోడియం హైపో క్లోరైడ్ ద్రావణంతో శుద్ధి చేశారు. ఆ నివాస ప్రాంతాన్ని కంటైన్మెంట్ జోన్‌గా ప్రకటించారు. ఎవరూ బయటకు వెళ్లవద్దని ఆంక్షలు విధించారు. ఆ భవనంలో నివసిస్తున్న వారి ఆరోగ్య పరిస్థితిపై సర్వే చేపట్టారు. అనుమానం ఉన్న వారికి పరీక్షలు నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు.
ఇవీ చదవండి..