ETV Bharat / state

మెడికొండ్రు మండలంలో మరో వ్యక్తికి కరోనా - గుంటూరులో కరోనా వార్తలు

గుంటూరు జిల్లా తాడికొండలోని మెడికొండ్రు మండలం విసదలకు చెందిన మరో వ్యక్తికి కరోనా పాజిటివ్ నిర్థరణ అయ్యింది. అతను ఇండోనేషియాలో జరిగిన తబ్లీగి జమాత్​లో పాల్గొని వచ్చాడని అధికారులు తెలిపారు.

corona positive for one more person in medikondru mandal at guntur district
మెడికొండ్రు మండలంలో మరో వ్యక్తికి కరోనా
author img

By

Published : Jun 4, 2020, 11:55 AM IST

గుంటూరు జిల్లా తాడికొండలోని మెడికొండ్రు మండలం విసదలకు చెందిన వ్యక్తికి కరోనా పాజిటివ్ నిర్థరణ అయినట్లు అధికారులు గుర్తించారు. అతను కొద్ది రోజుల క్రితం ఇండోనేషియాలో జరిగిన తబ్లీగి జమాత్​లో పాల్గొన్నాడు. అక్కడ నుంచి జిల్లాకు వచ్చిన అతడిని... ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో క్వారంటైన్ కేంద్రంలో ఉంచి పరీక్షలు నిర్వహించగా కరోనా పాజిటివ్​గా తేలింది. దీంతో అతడిని మంగళగిరి ఎన్​ఆర్​ఐ ఆసుపత్రిలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వార్డుకు తరలించారు.

అంతకు ముందు తురకాపాలెంకు చెందిన వ్యక్తి, మెడికొండ్రకు చెందిన యువకుడికి పాజిటివ్ వచ్చింది. దీంతో మెడికొండ్రు మండలానికు చెందిన ముగ్గురుకి పాజిటివ్ రావటంతో స్థానికులు భయాందోళనలకు గురవుతున్నారు.

ఇదీ చదవండి:

పచ్చని పల్లెలకు పాకుతున్న కరోనా

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.