గుంటూరు జిల్లా చిలకలూరిపేట నియోజకవర్గంలో రోజురోజుకి కరోనా విజృంభిస్తుంది. గురువారం ఒక్క రోజే నియోజకవర్గంలో 39 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. పట్టణంలోని వివిధ ప్రాంతాలలో 22 కేసులు, రూరల్ మండలంలో 13, నాదెండ్ల మండలంలో 4 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇప్పటివరకు నియోజకవర్గంలో పాజిటివ్ కేసులు సంఖ్య 250 దాటింది. పట్టణంలో 150 మందికి పైగా బాధితులు ఉన్నారు. దీంతో శుక్రవారం నుంచి ఈ నెల 31 వరకు పట్టణంలో సంపూర్ణ లాక్డౌన్ విధిస్తున్నట్లు అధికారులు ప్రకటించారు.
ఇదీ చదవండి: నిమ్స్‌లో మరికొందరిపై క్లినికల్ ట్రయల్స్