గుంటూరు జిల్లాలో కరోనా కేసులు మళ్లీ విజృంభించాయి. నిన్న ఒక్కరోజే 14 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మొన్న 23 కేసులు నమోదు కాగా.. కేసుల ఉద్ధృతి కొనసాగింది. జిల్లాలో మొత్తం కేసుల సంఖ్య 543 కి చేరింది. రెండు రోజుల్లోనే 37 కేసులు బయటపడటం ఆందోళన కలిగిస్తుంది. ఈ కేసుల్లో విదేశాలు, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారే ఎక్కువ మంది ఉన్నారు. ఇండోనేషియా నుంచి వచ్చిన ఐదుగురితో పాటు చెన్నై నుంచి ఇద్దరు, పుణె, హైదరాబాద్ నుంచి వచ్చిన ఒక్కొక్కరికి కరోనా పాజిటివ్ వచ్చింది. వెలగపూడి, బాపట్ల, మంగళగిరి, నరసరావుపేట, గుంటూరు నగరంపాలెం నుంచి ఒక్కో కేసును పాజిటివ్ గా గుర్తించారు. గుంటూరు బైపాస్ రోడ్డులో తాత్కాలికంగా నిర్వహించిన హోల్ సేల్ కూరగాయలు, పండ్ల మార్కెట్ లో ఉండే వ్యాపారుల్లో మొన్న 18 మందికి వైరస్ సోకగా.. మార్కెట్ ను అధికారులు మూసేశారు. వారి ప్రైమరీ, సెకంటడరీ కాంటాక్టు కేసులకు పరీక్షలు చేసేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు.
ఇదీ చదవండి: 'మీ ఇళ్లకు వేసుకోండి వైకాపా రంగులు'