గుంటూరు జిల్లాలో కరోనా కేసులు మళ్లీ విజృంభించాయి. ఇవాళ ఒక్కరోజే 13 కేసులు కొత్తగా నమోదయ్యాయి. జిల్లాలో ఇప్పటివరకు మొత్తం కేసుల సంఖ్య 478కి చేరింది. తాజాగా నరసరావుపేట- 5 , మాచర్ల-1 కేసులు నమోదు కాగా.. జిల్లాకు వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన వారిలో ఏడుగురికి కరోనా వైరస్ ఉన్నట్లు గుర్తించారు. తాజా కేసులతో నరసరావుపేటలో మొత్తం కేసుల సంఖ్య 197 కి పెరిగింది. గుంటూరు నగరంలో ఇప్పటివరకు 183 పాజిటివ్ కేసులు నిర్ధారణ అయ్యాయి. వీరిలో సుమారుగా 70శాతం మేర రోగులు ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. గుంటూరులో ప్రస్తుతం 8 చోట్ల, నర్సరావుపేటలో 6, తాడేపల్లిలోని 2 ప్రాంతాల్లో రెడ్ జోన్లు ఉన్నాయి.
ఇటీవలి కాలంలో తెనాలి, తాడేపల్లి, చిలకలూరిపేట, బాపట్ల, యడ్లపాడులో కొత్త కేసులు వెలుగు చూస్తున్నాయి. ఆయా ప్రాంతాల్లో కేసుల తీవ్రత, నమోదైన రోజులను బట్టి ఆంక్షలు సడలింపు దిశగా అధికారులు సన్నాహాలు చేస్తున్నారు.
ఇదీ చదవండి: రాష్ట్రంలో కొత్తగా 70 కరోనా పాజిటివ్ కేసులు