కరోనా వ్యాప్తి దృష్ట్యా పలు సంస్థలు ప్రజలకు అవగాహన కల్పిస్తున్నాయి. ఈ క్రమంలోనే గుంటూరులో పెయింటర్స్ సంక్షేమ సంఘం వారు రహదారిపై అవగాహన పెయింట్ వేశారు. లాక్ డౌన్ నిబంధనలు ఉల్లంఘించి ఇంటి నుంచి బయటకు వస్తే కరోనా రక్కసి కాచుకుని కూర్చుందనే అర్థం వచ్చేలా దీన్ని చిత్రీకరించారు. ఇళ్లలోనే ఉందాం... ప్రాణాలు కాపాడుకుందాం అంటూ నినదించారు. కరోనా విధుల్లో నిమగ్నమైన వైద్యసిబ్బంది, పోలీసు, పారిశుద్ధ్య సిబ్బందికి సహకరిద్దామన్నారు. అప్పుడే కరోనాని తరిమికొట్టవచ్చని సూచించారు. లాక్ డౌన్ కారణంగా తాము ఉపాధి కోల్పోయామని... త్వరగా ఈ మహమ్మారి నుంచి బయటపడాలని కోరుకుంటున్నట్లు పెయింటర్స్ సంక్షేమ సంఘం అధ్యక్షులు దుర్గా ప్రసాద్ తెలిపారు. ఈ పెయింటింగ్ కోసం అంతా కలిసి చందాలు వేసుకుని చిత్రీకరించినట్లు వివరించారు.
ఇవీ చదవండి: భారత్లో చిక్కుకున్న విదేశీయుల వీసా పొడిగింపు