ETV Bharat / state

యార్డుల్లోనే మగ్గుతున్న మిర్చి బస్తాలు

గుంటూరు మిర్చియార్డులో లాక్‌డౌన్‌ వలన 3 వేల కోట్ల రూపాయల లావాదేవీలు నిలిచిపోయాయి. సీజన్ మెుదలైన నెల రోజులకే యార్డు మూసివేయటంతో... రైతులు, కూలీలు ఆర్థికంగా తీవ్ర అవస్థలు పడుతున్నారు.

corona effect on guntur mirchi yard
లాక్​డౌన్​తో యార్డుకే పరిమితమైన మిర్చి
author img

By

Published : May 17, 2020, 7:42 AM IST

ఆసియాలోనే అతి పెద్ద మిర్చి విపణిగా పేరొందిన గుంటూరు మిర్చియార్డుకు కరోనా సెగ తగిలింది. సీజన్‌ మొదలైన రెండు మాసాలకే యార్డును మూసేయాల్సి వచ్చింది. కీలక సమయమంతా లాక్‌డౌన్‌తో ఆవిరైంది. ఈ ప్రభావం వల్ల సుమారు రూ.3వేల కోట్ల లావాదేవీలపై ప్రభావం పడింది. సీజన్‌లో నిత్యం లక్ష బస్తాలకు పైగా సరకు రావాల్సిన తరుణంలో లాక్‌డౌన్‌తో మార్కెట్‌ను మూసేశారు. మార్చి నాలుగోవారంలో మార్కెట్‌ మూతపడగా ఇప్పటివరకు సుమారు 50లక్షల బస్తాల మిర్చి అమ్మకాలు నిలిచిపోయాయి. జూన్‌ నుంచి మొదలయ్యే అన్‌ సీజన్‌లో ఇంత సరకును అమ్మాలంటే దాదాపు 4 నెలలు పడుతుంది. ప్రస్తుతం స్థానికంగా ఉన్న డిమాండ్‌కు అనుగుణంగా రోజువారీగా మార్కెట్‌ బయట, గ్రామాల్లో 20 వేల బస్తాల వరకు అమ్ముడవుతున్నాయి. ఇటీవల అత్యవసర అమ్మకాలకు ఇచ్చిన తాత్కాలిక అనుమతితో 6లక్షల బస్తాలనే రైతులు అమ్ముకోగలిగారు.

ఆగిన ఎగుమతులు

గుంటూరు యార్డు నుంచి మిర్చి ఎగుమతి అయ్యే చైనా, శ్రీలంక, సింగపూర్‌, బంగ్లాదేశ్‌, థాయ్‌లాండ్‌, మలేషియా తదితర దేశాల్లో పరిస్థితి ఇంకా సద్దుమణగలేదు. ఈ ప్రభావం ఎగుమతులపై కనిపిస్తోందని మార్కెట్‌వర్గాల అంచనా. పైగా, మిర్చి నిల్వలు ఎక్కువగా ఉండటంతో ధర తగ్గుతుందన్న ఆందోళన వ్యక్తమవుతోంది. లాక్‌డౌన్‌ నేపథ్యంలో పచ్చళ్ల తయారీ ఆగిపోవడం, హోటళ్లు, రెస్టారెంట్ల మూసివేత, శుభకార్యాలు వాయిదా పడటంతో దేశీయంగా కారానికి డిమాండ్‌ తగ్గింది. దేశీయ అవసరాలకు చివరికోత కాయలను రైతులు వ్యాపారులకు విక్రయిస్తున్నారు. శీతలగోదాముల వద్ద పరిమిత క్రయవిక్రయాలకు అనుమతించడంతో వ్యాపారులు, హమాలీలతో పాటు వాహనాలకు ఆటంకం లేకుండా చూడాలని కోరుతున్నారు. దూరప్రాంతాల నుంచి వచ్చే రైతులు, వ్యాపారులకు పోలీసులు వెసులుబాటు ఇవ్వాలని అడుగుతున్నారు. రైతుల ఇబ్బందులను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి మిర్చి క్రయవిక్రయాలకు ఆటంకాలు లేకుండా చూస్తామని యార్డు కార్యదర్శి వెంకటేశ్వరరెడ్డి తెలిపారు.

2 కోట్ల బస్తాల నిల్వలు

* గుంటూరు జిల్లాలోని శీతల గోదాములకు కోటి బస్తాల వరకు సరకు చేరింది.
* రైతుల దగ్గర ఇంకా 10 లక్షల బస్తాల పంట ఉంటుందని అంచనా.
* ఏపీలోనే మిగిలిన జిల్లాల్లో మరో 30 లక్షల బస్తాల వరకు ఉన్నాయి.
* తెలంగాణలో నిల్వలతో కలిపి సుమారు
* 2 కోట్ల బస్తాల నిల్వలు ఉంటాయని వ్యాపారుల అంచనా.

త్వరలో ఖరీఫ్‌ ప్రారంభం కాబోతోంది. వ్యవసాయ పెట్టుబడులకు, పంటరుణాల చెల్లింపులకు రైతులు పంటను అమ్ముకోవాలి. కానీ ఆదివారం తర్వాతైనా గుంటూరు మిర్చియార్డు తెరుస్తారా.. లేదా? అన్న విషయమై సందిగ్ధత కొనసాగుతోంది. గుంటూరులో చాలా ప్రాంతాలు రెడ్‌జోన్‌లో ఉన్నాయి. మార్కెట్‌ తెరిస్తే పెద్ద సంఖ్యలో రైతులు, వ్యాపారులు, హమాలీలు వస్తారు. దీంతో తెరవడంపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

ఇదీ చదవండి:

పోలీసులు కొట్టారంటూ యువకుడు ఆత్మహత్యాయత్నం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.