ETV Bharat / state

కరోనా ఎఫెక్ట్: దుర్భరంగా మారిన కళాకారుల జీవితాలు..! - కళాకారుల జీవితాలపై కరోనా ప్రభావం

కళలు, కళాకారులకు తెలుగునేల పెట్టింది పేరు. పౌరాణిక నాటకాల నుంచి హరికథలు, బుర్రకథలు, సంగీత కచేరీలు ఇలా ఎన్నో కళారూపాలపై ఆధారపడి కళాకారులు జీవిస్తున్నారు. కరోనా లాక్ డౌన్ కళాకారులకు ఉపాధి లేకుండా చేసింది. 8 నెలల నుంచి ఎలాంటి కార్యక్రమాలు లేకపోవటం వల్ల.. కళాకారులు అప్పులు, అర్ధాకలితో బతుకుబండి లాగించాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి.

కళావిహీనమైన కళాకారుల జీవితాలు
కళావిహీనమైన కళాకారుల జీవితాలు
author img

By

Published : Dec 3, 2020, 5:09 PM IST

మనసుని రంజింపజేసేది కళ. ఆనందాన్ని రేకెత్తింపజేసేది కళ. అలనాటి నాటకమైనా... నేటి సినిమా అయినా... ప్రేక్షకులను కట్టిపడేసి వారికి వినోదం పంచటమే పరమావధిగా కళాకారులు ప్రయత్నిస్తుంటారు. అందుకే కళాకారులకు మన సమాజంలో ప్రత్యేక స్థానం, గౌరవం ఉన్నాయి. వివిధ రకాల కళల్ని వృత్తిగా, ప్రవృత్తిగా మార్చుకున్న వారెందరో మన రాష్ట్రంలో ఉన్నారు. కొవిడ్-19 దేశంలోని అన్ని రంగాలతో పాటు కళారంగంపై తీవ్ర ప్రభావం చూపింది. ప్రదర్శనలు లేక వేలాదిమంది కళాకారులు ఇళ్లకే పరిమితమయ్యారు. కరోనా వచ్చినప్పుటి నుంచి కళాకారులకు పనుల్లేవు.

జీవితాలు దుర్భరం...

పౌరాణిక పాత్రల వేషధారణతో అలరిస్తూ పొట్ట పోసుకునే కళాకారుల జీవితాలు... కరోనా కారణంగా దుర్భరంగా మారాయి. ధగధగ మెరిసే కిరీటాలు, భుజకీర్తులు ధరించి పాటలు, పద్యాలతో అలరించే వారి జీవితాల్లో కారు చీకట్లు కమ్ముకున్నాయి. గంటల కొద్ది తమ గాత్రంతో అలరించే కళాకారుల గొంతు నేడు మూగబోయింది. రంగస్థలంపై నవరసాలను పలికించే కళాకారుల జీవితంలో నేడు దుఃఖం మాత్రమే మిగిలింది. కార్యక్రమాలు లేకపోవటంతో అందరూ సాధనకే పరిమితమయ్యారు. ఉద్యోగాలు, వ్యాపారాలు చేసుకుంటూ రంగస్థలంపై మక్కువతో నాటకాలు వేసే వారికి పెద్దగా ఇబ్బంది లేకపోయినా... ప్రదర్శనలపైనే ఆధారపడిన వారు మాత్రం ఆర్థిక సమస్యలతో సతమతమవుతున్నారు. కళాకారులతో పాటు వాయిద్య బృందాల వారిదీ ఇదే పరిస్థితి.

"కళాకారులు చాలా ఇబ్బందుల్లో ఉన్నారు. చాలా వరకు పేదలే కళాకారులుగా ఉన్నారు. కళనే నమ్ముకున్న వారి పరిస్థితి మరీ దీనంగా ఉంది. కరోనా వల్ల కళాకారుల జీవితాల్లో చీకట్లు అలుముకున్నాయి. కుల, మతాలు చూడకుండా ప్రభుత్వం సాయం చేయాలి. సీఎం జగన్ స్పందించి కళాకారులను ఆదుకోవాలని కోరుతున్నాం."

నలకా శ్రీనివాసరావు, పౌరాణిక కళాకారుల సంఘం అధ్యక్షులు

అన్​లాక్ ప్రారంభమైనా తప్పని తిప్పలు...

లాక్​డౌన్ ముగిసి అన్​లాక్ మొదలైనా... కళా ప్రదర్శనలకు మాత్రం ఇంకా అనేకానేక అడ్డంకులు ఎదురవుతున్నాయి. కరోనా నిబంధనల్లో భాగంగా ఎక్కడా 100 మందికి మించి ఉండేందుకు అనుమతి లేదు. దీంతో చాలమంది కార్యక్రమాలు నిరాడంబరంగా ముగించేస్తున్నారు. సాంస్కృతిక, వినోద కార్యక్రమాలకు చోటు కల్పించటం లేదు. ప్రైవేటు కార్యక్రమాలు లేవు. ప్రభుత్వమూ అవకాశాలూ కల్పించటం లేదు. పెళ్లిళ్లతో పాటు చిన్నచిన్న వేడుకలకు గతంలో ఆర్కెస్ట్రా, మిమిక్రీ వంటి కార్యక్రమాలు ఏర్పాటు చేసేవారు. కరోనా కారణంగా ఖర్చులు తగ్గించుకునే క్రమంలో కొందరు.. నిబంధనల పేరిట మరికొందరు ఇలాంటి వాటిని మినహాయిస్తున్నారు. పెద్ద కళాకారులు ఎలాగోలా నెట్టుకొస్తున్నా...పేద కళాకారులకు మాత్రం ఇబ్బందులు తప్పటం లేదు. మేకప్ ఆర్టిస్టులు, వాయిద్యకారుల పరిస్థితి దారుణంగా ఉంది. కొందరు చిన్నచిన్న కూలీ పనులకు వెళ్తున్నారు. తెనాలిలో ఓ గాయకుడైతే మాస్కులు అమ్ముతూ జీవనం సాగిస్తున్నాడు. మరికొందరు ఆటోడ్రైవర్లుగా, భవన నిర్మాణ కూలీలుగా బతకుబండిని నడిపిస్తున్నారు.

"మాలో చాలా మందికి రేషన్ కార్డులు లేవు. లాక్​డౌన్ సమయంలో అద్దె కట్టడానికి చాలా ఇబ్బందులు పడ్డాం. చాలా ప్రోగ్రాంలు చేసి చాలా మందిని అలరించాం. కానీ ఇప్పుడు మా పరిస్థితిని చూస్తే... ఎందుకు బతికున్నామా అనిపిస్తుంది. మా కళాకారులు ఇద్దరు, ముగ్గురు ఆత్మహత్యలు చేసుకున్నారు. ప్రభుత్వమే మమ్మల్ని ఆదుకోవాలి"

-ఆశ, గాయని

ప్రభుత్వ సాయం అంతంత మాత్రమే...

తమ కళ ద్వారా, పాట ద్వారా వినోదం-ఆనందం నింపిన కళాకారులు నేడు పస్తులుండాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎవరినీ చేయి చాచి అడిగే అవసరం ఇప్పటి వరకూ రాలేదని.., కరోనా కారణంగా అలాంటి పరిస్థితి ఏర్పడిందని కళాకారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అందటం లేదని వాపోతున్నారు. వృద్ధ కళాకారులకు ప్రభుత్వం నుంచి 3 వేల పెన్షన్ అందుతున్నా... మిగతా వారికి మాత్రం తిప్పలు తప్పటం లేదు. కరోనా వేళ తమను ప్రభుత్వమే ఆదుకోవాలని వేడుకొంటున్నారు.

ఇదీచదవండి

వైరల్: తరగతి గదిలో.. స్నేహితుల సమక్షంలో.. మైనర్ల వివాహం!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.