గుంటూరు జిల్లాలో కరోనా వైరస్ తీవ్రత రోజురోజుకు పెరుగుతోంది. జిల్లాలో బుధవారం ఒక్కరోజే 117 కేసులు నమోదయ్యాయి. ఈ క్రమంలో మొత్తం కేసుల సంఖ్య 1,633కు చేరుకుంది. కొత్తగా నమోదైన కేసుల్లో గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలోనే 49 కేసులు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఏటీ అగ్రహారంలో ఏడు, నెహ్రునగర్, నల్ల చెరువు, ఎంప్లాయీస్ కాలనీ, లాలాపేట, యాదవ బజార్, బ్రాడిపేట, చంద్రమౌళి నగర్లో రెండేసి కేసులు నమోదైనట్లు తెలిపారు. జిల్లాలోని క్వారంటైన్లో ఉన్న ఆరుగురికి కరోనా నిర్ధారణ అయింది.
తాడేపల్లి మండలంలో 25, తెనాలి 8, మంగళగిరి 3, పెదకాకాని, మాచర్ల 4 సత్తెనపల్లి 3, చిలువూరు, పెదకూరపాడులో రెండు పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అలాగే తాడికొండ, చుండూరు, చిలకలూరిపేట, నర్సరావుపేట, కూచిపూడి, దుగ్గిరాల, వినుకొండ, చాకలిగుంట, కొప్పురావూరు, వాజెండ్ల, దాచేపల్లిలో ఒక్కో కేసు చొప్పున నమోదైనట్లు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారులు తెలిపారు.
ప్రస్తుతం జిల్లాలో అత్యధిక కేసులు నమోదైన ప్రాంతాలు చూస్తే గుంటూరులో 654, నర్సరావుపేట 257, తాడేపల్లి 190, మంగళగిరి 66, తెనాలి 70, పెదకాకాని 26, చిలకలూరిపేట 24, దాచేపల్లి 24 కేసులు ఉన్నాయి.
ఇవీ చూడండి...
ఏ2 అల్లుడు కంపెనీకి 108, 104 అంబులెన్స్‌లు దానం చేశారు: తెదేపా