గుంటూరు జిల్లా నరసరావుపేటలో మరో కరోనా కేసు నమోదైంది. దీంతో పట్టణంలో మొత్తం కేసుల సంఖ్య 215కు చేరింది. పాజిటివ్ వచ్చిన కేసు బరంపేటకు చెందినదిగా అధికారులు తెలిపారు. లాక్ డౌన్ సడలింపులు ఉన్నందున ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని సూచించారు. భౌతిక దూరం పాటించడం, మాస్కులు పెట్టుకోవడం, శానిటైజర్లు వాడటం వంటివి చేయాలన్నారు.
ఇవీ చదవండి... ముగిసిన బడ్జెట్ సమావేశాలు..15 బిల్లులకు ఆమోదం