గుంటూరు జిల్లా తాడికొండ నియోజకవర్గం మేడికొండూరు మండలంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య మూడుకు చేరాయి. సిరిపురానికి చెందిన యువకుడు వృతి రీత్యా హైదరాబాద్‌లో ఉంటున్నాడు. ఈ నెల 16న రైలు మార్గంలో సొంతూరికి వచ్చాడు. అతని నమూనాలు పరీక్షించిన వైద్యులు కరోనా పాజిటివ్ ఉన్నట్లు గుర్తించారు.
గ్రామంలో 200 మీటర్లు కంటైన్మెంట్ జోన్ మరో 200 మీటర్లు బఫర్ జోన్‌గా ప్రకటించారు. ప్రత్యేక పారిశుద్ధ్య చర్యలు చేపట్టారు. మేడికొండూరు పోలీస్‌స్టేషన్‌లో ఎస్ఐకి కరోనా పాజిటివ్ వచ్చింది.సిబ్బందికి పరీక్షలు చేయనున్నారు.
ఇదీ చూడండి: నాపై కోపంతో... నా సన్నిహితులను ఇబ్బందిపెడతారా..?: గంటా