ETV Bharat / state

చిలకలూరిపేటలో కరోనా విజృంభణ - ప్రజల నిర్లక్ష్యంతో పెరుగుతున్న కరోనా కేసులు !

చిలకలూరిపేట నియోజకవర్గంలో రోజురోజుకు కరోనా కేసులు పెరుగుతున్నాయి. తాజాగా నాదెండ్ల మండల పరిధిలోని ఓ గ్రామంలో బాత మహిళకు కరోనా పాజిటివ్ నిర్ధరణ అయింది. మరోవైపు పట్టణంలో ఇద్దరి కారణంగా 12 మందికి పాజిటివ్ వచ్చింది.

ప్రజల నిర్లక్ష్యంతో పెరుగుతున్న కరోనా కేసులు !

author img

By

Published : Jun 7, 2020, 10:55 AM IST

గుంటూరు జిల్లా చిలకలూరిపేటలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. ప్రజలు కరోనా నిబంధలు పాటించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించటంతో కేసుల సంఖ్య నానాటికి పెరుగుతుంది. నరసరావుపేటలో పనిచేస్తూ చిలకలూరిపేటలో నివాసం ఉంటున్న వైద్యురాలికి ఏప్రిల్ నెలలో పాజిటివ్ నిర్ధరణ అయింది. సదరు వైద్యురాలు జాగ్రత్తలు పాటించటంతో సెకండరీ కాంటాక్ట్ లేకుండా ఆమెతోనే ఆ లింకు ఆగిపోయింది.

ఓ వృద్ధుడుకి అనారోగ్యంగా ఉండటంతో చిలకలూరిపేట ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకొచ్చారు. అనంతరం మెరుగైన చికిత్స కోసం సదరు వృద్ధుని గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ అతను మృతి చెందాడు. మృతదేహానికి కోవిడ్ పరీక్షలు నిర్వహించిన సదరు ఆసుపత్రి సిబ్బంది మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. వారు గ్రామంలో అంత్యక్రియలు నిర్వహించారు. మూడు రోజుల తర్వాత వృద్ధునికి కరోనా పాజిటివ్ ఉన్నట్లు నిర్ధరణ అయింది. దీంతో చిలకలూరిపేట ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్యులు, సిబ్బంది, వృద్ధుడి కుటుంబ సభ్యులు, బంధువులను క్వారంటైన్​కు తరలించి కోవిడ్ పరీక్షలు నిర్వహించారు. వృద్ధుడి కారణంగా అతని కుటుంబ సభ్యులు ముగ్గురికి, ఆస్పత్రిలో ఉన్న దోభికి పాజిటివ్ నిర్ధరణ అయింది.

పట్టణంలో అనారోగ్యంతో ఉన్న ఒక మహిళ కారణంగా ఆమె కుటుంబ సభ్యులు నలుగురికి ఇంటి పక్కన ఉన్న మరో ఇద్దరికీ పాజిటివ్ నిర్ధరణ అయింది. ఇలా కేవలం ఇద్దరి కారణంగా 12 మందికి పాజిటివ్ వచ్చింది. తాజాగా హైదరాబాద్ నుంచి వచ్చిన ఓ బాలింతకు పాజిటివ్ నిర్ధరణ అయింది. దీంతో మొత్తం నియోజకవర్గంలో పాజిటివ్ కేసులు సంఖ్య 14 కు చేరింది. పట్టణంలో మరో నలుగురు అనుమానితులకు కోవిడ్ పరీక్షలు నిర్వహించారు. వారి ఫలితాలు రావాల్సి ఉంది.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.