గుంటూరు జిల్లాలో కరోనా ఉద్ధృతి కొనసాగుతోంది. ఇవాళ 396 కేసులు నమోదయ్యాయి. దీంతో జిల్లాలో మొత్తం కేసుల సంఖ్య 64 వేల 618కు చేరుకుంది. కొత్తగా నమోదైన కేసుల్లో అత్యధికంగా గుంటూరు నుంచే 109 నమోదయ్యాయి. కేసులు తగ్గినట్లే తగ్గి మళ్లీ ఆందోళన కల్గిస్తున్నాయి.
గుంటూరు తర్వాత తెనాలిలో 24 కేసులు, నరసరావుపేటలో 22, మంగళగిరిలో 18, వినుకొండ, బాపట్లలో 17 చొప్పున, తాడేపల్లి, మాచర్లలో 16 కేసులు చొప్పున, వట్టిచెరుకూరులో 14, కొల్లూరులో 12 కేసులు, రొంపిచర్లలో 10 చొప్పున పాజిటివ్ కేసులు బయటపడ్డాయి. గుంటూరు జిల్లాలో ఇప్పటివరకు కరోనా నుంచి కోలుకుని 59వేల 118 మంది ఇంటికి చేరుకున్నారు. వైరస్ ప్రభావంతో ఇవాళ జిల్లాలో ముగ్గురు మృతి చెందగా.. మొత్తం మరణాల సంఖ్య 594కు చేరింది. రాష్ట్రంలో కరోనా కారణంగా అత్యధిక మరణాలు సంభంవించిన జిల్లాల్లో గుంటూరు రెండో స్థానంలో ఉంది.
ఇదీ చదవండి: 'వైఎస్సార్ బీమా' పథకం ప్రారంభం