గుంటూరు జిల్లాలో కరోనా తీవ్రత కొనసాగుతూనే ఉంది. కొత్తగా 12 పాజిటివ్ కేసులు నమోదైన కారణంగా జిల్లాలో మొత్తం బాధితుల సంఖ్య 555కు చేరుకుంది. ఇవాళ నమోదైన వాటిలో గుంటూరు నగరంలోని ముత్యాలరెడ్డి నగర్లో 2, ఎల్.బీ. నగర్లో 2, తాడేపల్లిలో 4, మంగళగిరిలో 1 కేసు ఉన్నాయి. దిల్లీ నుంచి వచ్చిన ముగ్గురికి పాజిటివ్‌గా తేలింది. వారందరినీ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వచ్చిన కేసులతో కలిపి గుంటూరు నగరంలో కరోనా బాధితుల సంఖ్య 214కు పెరిగింది.
ఇతర రాష్ట్రాలతో పాటు విదేశాల నుంచి వస్తున్న వారి ద్వారా కేసుల సంఖ్య పెరుగుతున్నట్లు అధికారులు గుర్తించారు. ఇతర ప్రాంతాల నుంచి వచ్చేవారు తప్పనిసరిగా క్వారంటైన్లో ఉండాలని సూచిస్తున్నారు. కరోనా నిర్ధరణ పరీక్షలు పూర్తయిన తర్వాతే వారు స్వస్థలాలకు వెళ్లేందుకు అనుమతిస్తున్నారు. కరోనా తీవ్రత ఎక్కువగా ఉన్న రాష్ట్రాల నుంచి రైళ్లలో వచ్చే అందరికీ పరీక్షలు చేస్తున్నారు. మిగతా రాష్ట్రాల నుంచి వచ్చేవారికి ర్యాండమ్ విధానంలో పరీక్షలు నిర్వహిస్తున్నారు.
ఇవీ చదవండి: