గుంటూరు జిల్లాలో కరోనా కేసుల నమోదు కొనసాగుతూనే ఉంది. ఇవాళ కొత్తగా మరో 3 కేసులు వెలుగుచూశాయి. వీటితో కలిపి జిల్లాలో కేసుల సంఖ్య 445కు చేరుకుంది. మాచర్లలో 1, తాడేపల్లిలో 1, నంబూరులో 1 చొప్పున తాజా బాధితులు నమోదైనట్లు అధికారులు తెలిపారు.
జిల్లాలోనే అత్యధికంగా నరసరావుపేటలో 190.. ఆ తర్వాత గుంటూరు నగరంలో 182 మంది బాధితులు ఉన్నారన్నారు. మాచర్ల, తాడేపల్లిలో ఇప్పటికే కేసులు ఉండగా... కొత్తగా నంబూరులోని వీవీఐటీ కాలేజీ క్వారంటైన్ కేంద్రంలో ఒకరికి కరోనా సోకింది. పోలీసులు అతని కాంటాక్ట్స్‌ను గుర్తించే పనిలో పడ్డారు.
ఇవీ చదవండి: