ETV Bharat / state

గుంటూరు జిల్లాలో ఇవాళ 10 కేసులు.. మొత్తం 373 - గుంటూరులో కొవిడ్ వార్తలు

గుంటూరు జిల్లాలో ఈరోజు నమోదైన 10 కరోనా పాజిటివ్ కేసులతో కలిపి మొత్తం కేసులు 373కు చేరుకున్నాయి. ఇందులో 150 మంది డిశ్చార్జ్ కాగా.. 8 మంది మృతిచెందారు.

corona cases in guntur district
గుంటూరు జిల్లాలో ఇవాళ 10 కేసులు.. మొత్తం 373..
author img

By

Published : May 7, 2020, 6:10 PM IST

గుంటూరు జిల్లాలో కరోనా కేసుల పెరుగుదల కొనసాగుతూనే ఉంది. ఇవాళ మరో 10 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో జిల్లాలో నమోదైన మొత్తం కేసుల సంఖ్య 373కు చేరింది. గుంటూరు అర్బన్ పరిధిలోని అహ్మద్ నగర్లో 5 కేసులు, సంగడిగంట, గుంటూరువారితోట, కుమ్మరి బజార్​లో ఒక్కో కేసు చొప్పున వెలుగుచూశాయి. తాడేపల్లిలో మరో 2 కేసులు పాజిటివ్​గా నిర్ధరించారు.

నరసరావుపేటలో ఇవాళ ఒక్క కేసు నమోదు కాకపోవడం ఉపశమనం కల్గించే అంశం. ఈరోజు 21 మంది డిశ్చార్జయ్యారు. జిల్లాలో ఇప్పటివరకు 373 కేసులు నమోదైతే... అందులో 150 మంది డిశ్చార్జ్ కాగా.. మరో 215 మంది చికిత్స పొందుతున్నారు. 8 మంది మృతిచెందారు.

ఇవీ చదవండి.. కరోనా కట్టడికి చతుర్ముఖ వ్యూహం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.