ETV Bharat / state

కోరలు చాస్తున్న కరోనా.. జిల్లాలో మూడు రోజుల్లోనే 522 కేసులు నమోదు

author img

By

Published : Mar 30, 2021, 8:39 AM IST

గుంటూరు జిల్లాలో కరోనా మళ్లీ కోరలు చాస్తోంది. కేవలం మూడు రోజుల్లోనే 522 కేసులు నమోదయ్యాయి. కేసుల వ్యాప్తి దృష్ట్యా.. వైద్యశాఖ అధికారులు వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేయడానికి కార్యాచరణ రూపొందించారు. మాస్కుల వాడకం, దుకాణల్లో పాటించాల్సిన కొవిడ్ నియంత్రణ చర్యలపై పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు.

corona, guntur
గుంటూరు, కరోనా

కరోనా మహమ్మారి తగ్గినట్లే తగ్గి మళ్లీ విజృంభిస్తోంది. ప్రత్యేకించి గుంటూరు జిల్లాలో రెండో విడత వేగంగా వ్యాప్తి చెందుతోంది. గడిచిన మూడు రోజుల్లోనే 522 పాజిటివ్ కేసులను గుర్తించారు. గుంటూరు నగరపాలకసంస్థ పరిధిలో అత్యధికంగా 49 కేసులు, తెనాలిలో 36 కేసులు నమోదయ్యాయి. పొన్నూరు, రేపల్లెలో ఏడేసి కేసులు చొప్పున, బాపట్ల, తుళ్లూరు, పొన్నూరులో నాలుగేసి కేసులు నమోదయ్యాయియి. తాజా కేసులతో కలిపి జిల్లాలో మొత్తం కేసుల సంఖ్య 77,272కి చేరింది. ప్రస్తుతం జిల్లాలో 655 క్రియాశీల కేసులున్నాయి.

వ్యాక్సిన్ ప్రక్రియకు అధికారుల కార్యాచరణ

మరోవైపు వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగవంతానికి వైద్యారోగ్యశాఖ అధికారులు కార్యాచరణ రూపొందించారు. ఏప్రిల్ 1 నుంచి 45 ఏళ్లు దాటినవారికీ వ్యాక్సిన్ వేయడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. జిల్లాలో 45 ఏళ్లు దాటినవారు 8 లక్షల మంది వరకు ఉండవచ్చని అంచనా వేయగా.. వీరికోసం 92 కేంద్రాలను సచివాలయాలు, పీహెచ్సీలు, సీహెచ్సీలు, యూహెచ్సీల్లో వేసేందుకు ఇప్పటికే ప్రణాళిక రూపొందించారు.

వ్యాక్సిన్ వేసుకునేందుకు ప్రజలు ముందుకు రావాలి

కొవిడ్ వ్యాక్సిన్​కు ప్రజలు ముందుకు రావాలని.. అపోహలు విడనాడాలని వైద్యారోగ్య శాఖ అధికారులు కోరుతున్నారు. వ్యాక్సిన్ వేసుకున్నప్పటికీ మాస్కు, శానిటైజర్లు, భౌతికదూరం పాటించాల్సిందేనని వారు స్పష్టం చేస్తున్నారు.

టీకా వేయించుకోనున్న సీఎం

45 ఏళ్లు దాటినవారికి వ్యాక్సిన్లు వేసే ప్రక్రియను.. సీఎం జగన్ ఏప్రిల్ 1న గుంటూరులో ప్రారంభించనున్నారు. ముఖ్యమంత్రి స్వయంగా భారత్ పేటలోని సచివాలయంలో వ్యాక్సిన్ వేసుకోనున్నారు. దీనికి సంబంధించి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.

మాస్కులు ధరించేలా చర్యలు

కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా మరోవైపు పోలీసులు సైతం ప్రజలంతా మాస్కులు ధరించేలా చర్యలు చేపట్టారు. ఉన్నతాధికారులు సైతం రంగంలోకి దిగి ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తున్నారు. మాస్కులు ధరించనివారికి జరిమానా విధింపుతో పాటు వారికి కౌన్సిలింగ్ ఇస్తున్నారు.

ఇదీ చదవండి:

కరోనా జాగ్రత్తలపై పోలీసుల అవగాహన కార్యక్రమాలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.