గుంటూరులోని పురపాలక పాఠశాలల్లో విద్యార్థులకు కరోనా వైరస్‌పై ఉపాధ్యాయులు అవగాహన కల్పించారు. కరోనా పుట్టుక, ఇప్పటి వరకూ చూపిన ప్రభావం గురించి వివరించారు. వ్యాధి రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, వచ్చిన వారు పాటించాల్సిన నియమాలు తెలియజేశారు. విద్యార్థులు తమ ఇళ్లల్లో కరోనా గురించి వివరించి కుటుంబసభ్యులను, చుట్టుపక్కల వారిని అప్రమత్తం చేయాలని సూచించారు. రాష్ట్రంలోని అన్ని మున్సిపల్ పాఠశాలల్లో ఈ తరహా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని పురపాలకశాఖ నుంచి ఆదేశాలు వచ్చాయని అధికారులు తెలిపారు.
ఇదీ చదవండి: