ETV Bharat / state

గృహ నిర్మాణ సంస్థ, ప్లాట్ల యజమానుల మధ్య వివాదం..ఎందుకంటే..!

author img

By

Published : Aug 2, 2021, 6:06 PM IST

గుంటూరు జిల్లా పెదకాకాని మండలం నంబూరులో వివాదం జరిగింది. రెయిన్ ట్రీ పార్క్ గృహసముదాయాల యజమానులు, గృహ నిర్మాణసంస్థ మధ్య ప్రధాన ప్రవేశ మార్గం విషయంలో గొడవ జరిగింది.

Raintree Park housing estates
రెయిన్ ట్రీ పార్క్
ప్రధాన ప్రవేశ మార్గం విషయంలో యజమానులు,గుత్తేదారు సంస్థకు మధ్య వివాదం

గుంటూరు జిల్లా పెదకాకాని మండలం నంబూరులోని రెయిన్ ట్రీ పార్క్ గృహసముదాయాల వద్ద వివాదం జరిగింది. ప్రధాన ప్రవేశ మార్గం నిర్వహణ ఎవరు చేపట్టాలనే విషయంలో వివాదం తలెత్తింది. ఇప్పటికే అక్కడ ఉన్న ప్లాట్ల యజమానులు అందరూ కలసి ఓ సంఘంగా ఏర్పడి సెక్యూరిటీతో పాటు ప్రవేశ మార్గం నిర్వహణ చూసుకుంటున్నారు. అయితే గృహ సముదాయాలు నిర్మించిన ఐజేఎం సంస్థ ప్రధాన ప్రవేశ మార్గాన్ని స్వాధీనం చేసుకునేందుకు యత్నించింది. తమ సంస్థ సెక్యూరిటీ గార్డులను అక్కడ మోహరించగా.. ప్లాట్ యజమానులు అడ్డుకున్నారు.

ప్లాట్లు తాము కొనుగోలు చేశాక నిర్మాణ సంస్థకు ఇక్కడ పని లేదని స్పష్టం చేశారు. ఐజేఎం సంస్థ ఇదే ప్రాంతంలో కొత్త వెంచర్లు ప్రారంభిస్తున్న సందర్భంలో అక్కడి వ్యవహారాల్ని తమ చేతుల్లోకి తీసుకోవాలని భావిస్తుందని ఆరోపించారు.

ఇదీ చదవండి

గుంటూరులో తెదేపా, వామపక్షాల ఆందోళన..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.