ETV Bharat / state

Contractors Bills: రాష్ట్రంలో బిల్లుల గోస..! దిక్కుతోచని స్థితిలో కాంట్రాక్టర్లు..

author img

By

Published : May 9, 2023, 7:42 AM IST

Contractors Bills: రాష్ట్రంలో బిల్లుల చెల్లింపులకు ఓ విధానమంటూ లేదు. ప్రభుత్వం ఎప్పుడు బిల్లులు చెల్లిస్తుందో తెలియదు. ఖర్చు చేసిన కోట్లాది రూపాయలు ఎప్పుడు చేతికి అందుతాయో చెప్పే వ్యవస్థ ఉండదు. బిల్లులు ఇవ్వండి మహాప్రభో అంటూ వేడుకుందామన్నా.. ఎవర్ని కలవాలో అంతుచిక్కదు. నడిసంద్రంలో చిక్కిన నావలాగా.. ఏం చేయాలో, ఎలా చేయాలో.. బిల్లులు రాబట్టుకునే దారేంటో తెలియక గుత్తేదారులు దిక్కుతోచని స్థితిలో పడిపోయారు. అందరి పరిస్థితి ఇదేనా అంటే.. కానేకాదు అంటున్నారు కాంట్రాక్టర్లు. అయినవాళ్లకు ఆకుల్లో, కానివారికి కంచాల్లో అన్నట్లు.. పలుకుబడి, సిఫార్సులు ఉన్నవారి పని సాఫీగానే సాగిపోతుండగా.. ఏళ్లు గడుస్తున్నా కానివారి కష్టాలు మాత్రం తీరడం లేదని బడుగు కాంట్రాక్టర్లు బావురుమంటున్నారు.

Contractors Bills
గుత్తేదారుల బిల్లులు

గుత్తేదారుల బిల్లులు

Contractors Pending Bills: వేల కోట్ల పెట్టుబడులు పెట్టి పనులు చేసిన కాంట్రాక్టర్లు.. ఏళ్లు గడుస్తున్నా ప్రభుత్వం బిల్లులు చెల్లించక, ఎప్పుడు చెల్లిస్తుందో తెలియక సతమతమవుతున్నారు. రాష్ట్రంలో ఎప్పుడూ ఇలాంటి దారుణమైన పరిస్థితులు చూడలేదని వాపోతున్నారు. కనీసం బిల్లులు సమర్పించాలన్నా గుత్తేదారులకు ఇబ్బందులు తప్పడం లేదు. కిందామీదా పడి బిల్లు సమర్పిస్తే.. అది ఎక్కడుందో, ఎప్పుడు కదులుతుందో, తమ ఖాతాలకు డబ్బులు ఎప్పుడు జమవుతాయో చెప్పే దిక్కూమొక్కూ లేదు. ఈ పరిస్థితులతో విసిగిపోయిన గుత్తేదారులంతా కలిసి తమ సమస్యలపై ప్రభుత్వానికి అల్టిమేటం ఇచ్చారు. బిల్లులు చెల్లించకపోతే పనులు ఆపేస్తామని హెచ్చరించారు.

దీనిపై నేరుగా కేంద్ర ఆర్థికశాఖ కార్యదర్శికి లేఖ కూడా రాశారు. పలుకుబడి ఉన్నవారికే బిల్లుల సొమ్ములు వస్తున్నాయని, సిఫారసులు ఉంటేనే పనవుతోందని.. కేంద్రానికి ఫిర్యాదు చేశారు. కానీ ఎలాంటి ప్రయోజనం కనిపించడం లేదు. కొత్త ఆర్థిక సంవత్సరంలో అడుగుపెట్టినా.. పాత ఏడాది బకాయిలు మాత్రం వసూలు కాలేదు. చాలా పెండింగు బిల్లుల్ని కొత్త బడ్జెట్‌లోకి బదిలీ చేయలేదు. దీనివల్ల మళ్లీ మొదటి నుంచి బిల్లులు సమర్పించుకోవడం, బడ్జెట్‌ ఆమోదం పొందడం, బడ్జెట్‌ విడుదల ఉత్తర్వుల కోసం ప్రయత్నించడం, డబ్బులు చేతికొచ్చేదాకా అందర్నీ బతిమాలుకోవడం తప్పదన్నట్లు తయారైంది పరిస్థితి.

కొన్నాళ్ల కిందటి వరకు సచివాలయంలోని ఆర్థికశాఖ ఉన్నతాధికారుల చుట్టూ గుత్తేదారులు తిరిగేవారు. బిల్లులు చెల్లించండి మహాప్రభో అని రోజూ అడిగేవారు. ఓ సందర్భంలో కాంట్రాక్టర్ల ఒత్తిడి ఉద్రిక్తతకు దారితీసింది. సచివాలయంలోని ఆర్థికశాఖ అధికారుల కార్యాలయాలకు పోలీసు భద్రతను ఏర్పాటు చేసుకుని.. గుత్తేదారులు తమ చెంతకు రాకుండా చూసుకుంటున్నారు. ఈ పరిస్థితుల్లో ఏం చేయాలో దిక్కుతోచని గుత్తేదారులు.. ఏ ప్రభుత్వ శాఖల్లో పనులు చేశారో ఆయా శాఖల ముఖ్య కార్యదర్శుల దగ్గరకెళ్లి ఒత్తిడి చేయడం మొదలుపెట్టారు. కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభమయ్యాక అనేక శాఖల అధికారులు, ఆర్థికశాఖ అధికారులతో బిల్లుల అంశాన్ని ప్రస్తావిస్తూ వచ్చారు.

అయితే నాలుగైదు నెలల వరకు ఏ బిల్లులూ చెల్లించలేమని, ఆ తర్వాతే చూస్తామంటూ వారు చెప్పినట్లు తెలిసింది. అదే సమయంలో.. ఆయా శాఖల ఉన్నతాధికారులు.. కాంట్రాక్టర్లకు అపాయింట్‌మెంట్‌ ఇవ్వడం మానేశారు. బిల్లుల చెల్లింపులకు ఒక విధానమంటూ ఉంటే కాస్త అటు, ఇటుగా డబ్బులు అందుతాయని ఆశించవచ్చని.. ఈ ప్రభుత్వంలో ఆ అవకాశమూ లేదని కాంట్రాక్టర్లు వాపోతున్నారు. పలుకుబడి కలిగిన వారికి, ప్రభుత్వ పెద్దల మద్దతున్న వారికే బిల్లుల సొమ్ములు వస్తున్నాయని అంటున్నారు. అందరికీ ఇవ్వడానికి తమ వద్ద డబ్బు లేదని.. ఉన్న కాస్తంత మొత్తాన్ని ఇష్టమొచ్చినవారికి ఇచ్చుకుంటామని ఆర్థికశాఖకు చెందిన ఓ అధికారి జంకూగొంకూ లేకుండా చెప్పారంటూ గుత్తేదారులు వాపోతున్నారు.

గతంలో ఫస్ట్‌ ఇన్‌ ఫస్ట్‌ అవుట్‌ అంటూ.. ఫిఫో విధానం ద్వారా కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించేవారు. ఈ విధానంలో ప్రతి బిల్లుకూ ఓ సీరియల్‌ నెంబర్ ఉంటుంది. బిల్లులు సమర్పించిన వరుస క్రమంలో.. అందుబాటులో ఉన్న నిధుల ఆధారంగా కాంట్రాక్టర్లకు చెల్లించేవారు. ఒకవేళ తమకు ఇష్టమైన గుత్తేదారు బిల్లు కింది నెంబర్‌లో ఉన్నా.. పైనున్న వారందిరీ చెల్లించాకే తర్వాతి నెంబర్‌ వారికి ఇచ్చేవారు. చాలా ఏళ్లపాటు ఇదే పద్ధతి కొనసాగింది. అప్పట్లో కొంత ఆలస్యమైనా డబ్బులు వస్తాయని గుత్తేదారుల్లో భరోసా ఉండేది. కానీ ఇప్పుడు మాత్రం అయినవారికే బిల్లుల సొమ్ములు అందుతున్నాయి.

ఈ విషయంలో అత్యున్నతస్థాయి కార్యాలయం కీలకపాత్ర పోషిస్తోందనే విమర్శలు వస్తున్నాయి. దీనివల్ల బిల్లుల కోసం చాలాకాలం ఎదురుచూస్తూ.. గుత్తేదారులు ఆర్థిక సంక్షోభంలో చిక్కుకునే పరిస్థితులు ఏర్పడ్డాయి. మార్చి 31కి ముందు 3 నెలల పాటు సీఎఫ్ఎమ్ఎస్ వెబ్‌సైట్‌ మూతపడటంతో.. గుత్తేదారులు బిల్లులు సమర్పించే అవకాశమే లేకుండా పోయింది. ‍ఒ‍కప్పుడు మార్చి చివర్లో మాత్రం బిల్లులు తీసుకునేవారు కాదు. అలాంటిది ఈసారి చివరి త్రైమాసికంలో చాలా రోజులు బిల్లులు తీసుకోకపోవడంతో గుత్తేదారులకు ఇబ్బందులు ఎదురయ్యాయి.

గతంలో సీఎఫ్ఎమ్ఎస్​లో ఒక మాడ్యూల్‌లోనే అన్ని బిల్లులూ సమర్పించేవారు. వాటికి నెంబర్లు ఉండటం వల్ల.. ఏ బిల్లు ఏ స్థాయిలో ఉంది, డబ్బులు ఎప్పటికి అందుతాయో ఒక అంచనా ఉండేది. కొన్ని రోజులుగా సీఎఫ్ఎమ్ఎస్​లో మాడ్యూల్‌-2లో బిల్లులు సమర్పించాలని ఇంజినీరింగ్‌ శాఖలకు అవకాశం కల్పించారు. దీనివల్ల త్వరగా క్లియర్‌ అవుతాయని చెప్పారు. ఇంజినీరింగ్‌ డిపార్టుమెంట్లు, నిర్మాణ పనుల బిల్లులన్నీ అందులో సమర్పించాల్సి ఉంటుందని.. మిగిలిన శాఖల బిల్లులన్నీ ఫేజ్‌-1లో సమర్పించాలని సూచించారు.

అయితే.. రెండో మాడ్యూల్‌లో సమర్పించిన బిల్లుల పరిస్థితి ఏంటో కూడా తెలియడం లేదు. ప్రతి ఇంజినీరింగ్‌ పనిలోనూ ఎమ్-బుక్‌ ఆధారంగా బిల్లు చేసి, ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీరు స్థాయిలోనే సమర్పిస్తుంటారు. గతంలో బిల్లుల సమర్పణలో మొదటవచ్చిన వాటిని మొదట, తర్వాత వచ్చిన వాటికి తర్వాత చెల్లించే విధానం ఉండేది. ఇప్పుడు ఆ వెబ్‌సైట్‌ బిల్లుల్ని తీసుకోవడం లేదు. సహజంగా ఈఈ కార్యాలయం నుంచి "పే అండ్‌ అకౌంట్స్‌" కార్యాలయానికి.. అక్కడి నుంచి ఆర్థికశాఖకు బిల్లు వెళ్తాయి. అక్కడ నిధుల లభ్యత, బడ్జెట్‌ ఆమోదాన్ని బట్టి కాంట్రాక్టర్లకు బిల్లుల చెల్లింపులు చేస్తుంటారు.

ప్రస్తుతం ఈఈ కార్యాలయం నుంచే 3 నెలలుగా బిల్లులు సమర్పణకు తిప్పలు తప్పడం లేదు. సర్వర్‌ పని చేయడం లేదు. ఆర్థిక సంవత్సరం ఆఖరి నెల చివరి రోజుల్లో కొన్ని అవకతవకలు జరిగినట్లు ఆరోపణలు వస్తున్నాయి. కావాల్సిన వారికే వెబ్‌సైట్‌లో వెసులుబాటు కల్పించారన్న విమర్శలు చెలరేగాయి. కర్నూలు, వైఎస్సార్, కృష్ణా, తూర్పుగోదావరి జిల్లాలోని కొందరు గుత్తేదారుల కోసం.. కొన్ని రోజుల పాటు రాత్రి వేళల్లో కొంత సమయం వెబ్‌సైట్‌లో బిల్లుల సమర్పణకు అవకాశం కల్పించారనే ఆరోపణలు వచ్చారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.