పెట్రోల్, డీజిల్ ధరల పెంపునకు వ్యతిరేకంగా గుంటూరులో కాంగ్రెస్ నేతలు నిరసన చేపట్టారు. స్థానిక పార్టీ జిల్లా కార్యాలయం నుంచి హిందూ కళాశాల కూడలి వరకు ద్విచక్రవాహనలు, ఆటోలను నెట్టుకుంటూ వెళుతూ వినూత్నంగా నిరసన వ్యక్తం చేశారు. అనంతరం పార్టీ కార్యాలయ ప్రాగంణంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
కరోనా కష్టకాలంలో పెట్రోల్, డీజిల్ ధరలు పెంచడం హేయమైన చర్య అని పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షడు మస్తాన్ వలి అన్నారు. నిత్యవసర సరకుల ధరలు పెరిగి రాష్ట్ర ప్రజలు నానా అవస్తులు పడుతున్నారని.. మరికొందరు ఆసుపత్రిలో బెడ్లు, మందులు కొరతతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని వాపోయారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ప్రజలు త్వరలోనే తగిన బుద్ధిచెబుతారని మస్తాన్ వలీ హెచ్చరించారు.
ఇదీ చదవండి:
రహస్య ప్రాంతానికి ఆనందయ్య.. మందుపై నివేదికలు వచ్చేవరకు అంతేనా?