గుంటూరులో తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ మున్సిపల్ కార్యాలయం ఎదుట కార్మికులు ఆందోళన చేపట్టారు. కరోనాను నివారించడంలో మున్సిపల్ కార్మికుల పాత్ర కీలకమని...వారికి గత 4 నెలల నుంచి వేతనాలు చెల్లించకపోవడం దారుణమని ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి కోటా మాల్యాద్రి అన్నారు. పెండింగ్లో ఉన్న వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. సమాన పనికి సమాన వేతనం చెల్లించాలన్నారు. ఒప్పంద కార్మికులను పర్మినెంట్ చేయాలన్నారు. కాంట్రాక్టు కార్మికులను పర్మినెంట్ చేస్తానన్న సీఎం జగన్.. నేడు వారిని ఔట్ సోర్సింగ్ కార్పొరేషన్లో చేర్చడం దారుణమన్నారు. తక్షణమే తమ సమస్యలను పరిష్కరించకపోతే ఆందోళలను తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు.
గుంటూరులో మున్సిపల్ కార్మికుల ఆందోళన - Concern of municipal workers in Guntur news
తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ గుంటూరు మున్సిపల్ కార్యాలయం ఎదుట కార్మికులు ఆందోళన చేపట్టారు.