ETV Bharat / state

బాధిత కుటుంబాలకు న్యాయం చేయాలని ఆందోళన

గుంటూరు జిల్లా దాచేపల్లి నగర పంచాయితీ పరిధిలోని నారాయణపురంలో కుల పంచాయితీలో నలుగురిపై కొందరు దాడి చేశారు. ఈ ఘటనలో నీలకంఠబాబు అనే యువకుడు మృతి చెందాడు. బాధిత కుటుంబాల బంధువులు న్యాయం చేయాలని కోరుతూ నారాయణపురం బంగ్లా కూడలి ప్రాంతంలోని జాతీయ రహదారిపై బైఠాయించి ఆందోళన చేశారు.

అద్దంకి- మార్కెట్ పల్లి వద్ద ఆందోళన
అద్దంకి- మార్కెట్ పల్లి వద్ద ఆందోళన
author img

By

Published : Nov 2, 2020, 8:04 AM IST

గుంటూరు జిల్లా గురజాల నియోజకవర్గం దాచేపల్లి నగర పంచాయితీ పరిధిలోని నారాయణపురంలో సెప్టెంబరు 10న జరిగిన కుల పంచాయితీలో జరిగిన దాడి ఘటనలో న్యాయం చేయాలని బాధిత కుటుంబాలకు చెందిన బంధువులు, వడ్డెర కార్మికులు ఆదివారం జాతీయ రహదారిపై బైఠాయించి పెద్దఎత్తున ఆందోళన నిర్వహించారు. కుల పంచాయితీలో నలుగురిపై కొందరు కత్తులతో దాడి చేశారు. వీరిలో నీలకంఠబాబు సెప్టెంబరు 12న మృతిచెందారు. మిగతా ముగ్గురు గుంటూరు జీజీహెచ్‌లో వైద్యసేవలు పొంది ఇళ్లకు చేరుకున్నారు. పోలీసులు అప్పట్లో 14 మందిపై కేసునమోదు చేసి ఆరుగురు నిందితులను అరెస్టు చేశారు.

కొందరిని మాత్రమే అరెస్టు చేసిన పోలీసులు మిగతా నిందితులను రాజకీయ నాయకుల జోక్యంతో అరెస్టు చేయడం లేదని బాధిత కుటుంబ సభ్యులు ఆరోపించారు. ప్రభుత్వం వెంటనే పరిహారమివ్వాలని నినాదాలు చేస్తూ రెండు గంటలకుపైగా రోడ్డుపై బైఠాయించడంతో ట్రాఫిక్‌ స్తంభించింది. పోలీసులు రంగప్రవేశం చేసి ఆందోళనకారులతో మాట్లాడారు. త్వరలో మిగతా నిందితులను అరెస్టు చేస్తామని భరోసా ఇవ్వడంతో ఆందోళన విరమించారు. అనంతరం పోలీసులు ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించారు.

ఇవీ చదవండి

'పరీక్షలకు అనుమతించకుంటే ఉరితాడే మాకు శరణ్యం'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.