తెలంగాణ మాజీమంత్రి ఈటల రాజేందర్ భూ కబ్జా వ్యవహారంలో ముఖ్యమంత్రి కేసీఆర్కు మరో ఫిర్యాదు అందింది. ఈటల కుమారుడు నితిన్ రెడ్డి తన భూమి కబ్జా చేశారని మేడ్చల్ జిల్లా రావల్కోల్ గ్రామానికి చెందిన పీట్ల మహేశ్ ముదిరాజ్ అనే వ్యక్తి కేసీఆర్కు ఫిర్యాదు చేశారు. న్యాయం చేయాలని కోరారు. మహేశ్ ఫిర్యాదును పరిశీలించిన ముఖ్యమంత్రి.. తక్షణం దీనిపై దర్యాప్తు జరిపించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఆదేశించారు.
ఏసీబీ, విజిలెన్స్, రెవెన్యూ శాఖలు సమన్వయంతో సమగ్ర దర్యాప్తు నిర్వహించి.. నివేదిక అందించాలని సీఎం ఆదేశాల్లో పేర్కొన్నారు.
ఇదీ చూడండి: రాష్ట్రంలో కొవిడ్ పాజిటివిటీ రేటు తగ్గింది: ఏకే సింఘాల్