రాజధాని కోసం ఆందోళన చేస్తున్న రైతులపై అవమానకర వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డిపై ఐకాస నేతలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కృష్ణా, గుంటూరు జిల్లాలకు చెందిన వారితో ధర్నాలు నిర్వహిస్తున్నారని రామకృష్ణారెడ్డి ఆదివారం వ్యాఖ్యానించారు. దీనిపై మంగళగిరి ఐకాస నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ భవిష్యత్ కోసం నిరసనలు చేస్తున్న రైతులను కించపరిచేలా మాట్లాడటం తగదని హితవు పలికారు. మంగళగిరిలో రైతులు రోడ్లపైకి వస్తుంటే ఎమ్మెల్యే ఆర్కే ఒక్కసారైనా వచ్చి మాట్లాడారా అని ప్రశ్నించారు. ఎన్నికల సమయంలో రాజధాని ఇక్కడే ఉంటుందని చెప్పిన ఆయన ఇప్పుడు మాటమార్చారని విమర్శించారు.
ఇవీ చదవండి..