పంట నష్టంపై రైతులను పూర్తిస్థాయిలో ప్రభుత్వం ఆదుకుంటుందని కలెక్టర్ శామ్యూల్ ఆనంద్ భరోసా ఇచ్చారు. ముంపు గ్రామాల్లో తాగునీరు, పారిశుద్ధ్య పరిరక్షణ పనులు వేగంగా చేపట్టాలని... దోమల నివారణకు ముంపు గ్రామాల్లో ఫాగింగ్ చేపట్టాలని కలెక్టర్ సూచించారు. ఒక్కో బాధిత కుటుంబానికి 25 కిలోల బియ్యం, కిలో చొప్పున బంగాళాదుంపలు, కందిపప్పు, ఉల్లిపాయలు, లీటర్ పామాయిల్, లీటర్ కిరోసిన్ పంపిణీ చేపడుతున్నామని చెప్పారు. కొట్టుకొచ్చిన ప్లాస్టిక్ వ్యర్థాలు, చెత్తాచెదారాన్ని జేసీబీల ద్వారా తొలగించి డంపింగ్ యార్డులకు తరలించాలని శామ్యూల్ ఆనంద్ ఆదేశించారు.
ఇదీ చదవండి: బీసీ కార్పొరేషన్ల ఛైర్మన్లు, డైరెక్టర్ల నియామకం