Collector Inspected Covid Ward: కొవిడ్‌ను ఎదుర్కొనేందుకు అన్నిచర్యలు తీసుకుంటున్నట్లు గుంటూరు జిల్లా కలెక్టర్ వేణుగోపాల్ రెడ్డి చెప్పారు. ఆయన గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రిలో కొవిడ్ సన్నాహాక ఏర్పాట్లను పరిశీలించారు. ఆసుపత్రిలో సదుపాయాలు, ఐసోలేషన్ సామర్ధ్యం, ఐసీయూ, వెంటిలేటర్ పడకల సంఖ్యలను గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఆసుపత్రిలోని ఆక్సిజన్ ప్లాంట్ల పనితీరును పరిశీలించారు. కరోనా ఓపీ, బెడ్స్ గురించి ఆరా తీశారు.
రెండో వేవ్ సమయంలో ఆక్సిజన్ సమస్యలు ఎదురయ్యాయని.. అలాంటి సమస్యలు తలెత్తకుండా ఆక్సిజన్ ప్లాంట్లను సిద్ధం చేశామని వివరించారు. ప్రభుత్వ వైద్య కళాశాలలో వీడీఆర్ఎల్ ల్యాబ్‌లో కొవిడ్ పరీక్షలు చేస్తున్నామని... తెనాలిలో త్వరలో ఏర్పాటు చేసేందుకు చర్యలు చేపట్టామని కలెక్టర్ వేణుగోపాల్ రెడ్డి వివరించారు. పండుగ సీజన్లు రావడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆయన కోరారు. విదేశాల నుంచి వచ్చిన ప్రయాణికులకు ప్రత్యేక స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహిస్తామని చెప్పారు.
ఇవీ చదవండి: