రాష్ట్రంలో పేద ప్రజలకు అన్ని రకాల సదుపాయాలను కల్పించాలని డిమాండ్ చేస్తూ... మే 4 నుంచి సీపీఐ దీక్షలు చేపట్టనుందని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ పేర్కొన్నారు. కరోనాతో సహజీవనం చేయాలన్న వ్యాఖ్యలను సీఎం వెంటనే వెనక్కి తీసుకోవాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ డిమాండ్ చేశారు. కరోనాపై ముఖ్యమంత్రి అవగాహన లేకుండా ఈ వ్యాఖ్యలు చేశారని విమర్శించారు. అలాగే కరోనా కేసులు అధికంగా ఉన్న జిల్లాల్లో సీఎం పర్యటించి ప్రజలకు భరోసా కల్పించాలన్నారు.
కరోనా నేపథ్యంలో పారిశ్రామిక వేత్తలు మళ్లీ 12 గంటల పని దినాన్ని తెరపైకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారని రామకృష్ణ ఆరోపించారు. విదేశాలకు పారిపోయిన 50 మంది పారిశ్రామిక వేత్తల 69 వేల కోట్ల రూపాయలను పీఎం ఒక్క కలం పోటుతో మాఫీ చేశారని ఈ విషయంపై కేంద్రంతో పోరాడతామన్నారు. లాక్డౌన్ నేపథ్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పేద కుటుంబాలకు 10 వేల రూపాయలు చొప్పున పరిహారం ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి