ETV Bharat / state

'జూన్ 1 కల్లా రైతు భరోసా కేంద్రాలు సిద్ధం' - రైతు భరోసా కేంద్రాలపై సీఎం సమీక్ష

రైతు భరోసా కేంద్రాల ఏర్పాటు దిశగా రాష్ట్ర ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోంది. జూన్ 1 కల్లా వీటిని పూర్తి చేస్తామని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి అధికారులు వివరించారు. మరోవైపు ఖరీఫ్ నాటికి రైతులకు 56 లక్షల క్రెడిట్, డెబిట్‌ కార్డులు ఇచ్చేలా చర్యలు చేపట్టాలని సీఎం జగన్ నిర్దేశించారు.

cm jagan review
cm jagan review
author img

By

Published : Apr 27, 2020, 9:28 PM IST

రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 11,158 రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేయాలని సీఎం జగన్‌ అధికారులను ఆదేశించారు. 10,592 భవనాలను ఇప్పటికే గుర్తించామన్న అధికారులు... జూన్‌ 1 కల్లా రైతు భరోసా కేంద్రాలన్నీ సిద్దమవుతాయని ముఖ్యమంత్రికి వివరించారు. రైతుభరోసా కేంద్రాలపై సచివాలయంలో ముఖ్యమంత్రి జగన్ సమీక్ష నిర్వహించారు. ఆ కేంద్రాల్లో ఏర్పాటు చేయనున్న కియోస్క్​ను పరిశీలించారు. డెబిట్‌, క్రెడిట్‌ కార్డు తీసుకొస్తే రైతులకు మరింత లాభం ఉంటుందని సీఎం అభిప్రాయపడ్డారు. తన డబ్బు తన చేతికి రాదన్న భయం రైతులకు ఉండకూడదని సీఎం అన్నారు. బ్యాంకుకు వెళ్లి కార్డు చూపిస్తే డబ్బు అన్నదాత చేతికిచ్చేలా ఉండాలని చెప్పారు. ఈ - క్రాప్‌నకు లింక్‌ చేస్తూ క్రెడిట్‌ కార్డు ఉండాలని పేర్కొన్నారు. ప్రభుత్వం ఇచ్చే డబ్బు డెబిట్‌ కార్డు‌ ద్వారా రైతుకు అందాలని స్పష్టం చేశారు. కొత్త క్రెడిట్‌ కార్డులు ఇవ్వటంతో పాటు కొత్త ఖాతాలు తెరవాలని అధికారులను సీఎం ఆదేశించారు. 56 లక్షల క్రెడిట్, 56 లక్షల డెబిట్‌ కార్డులు ఖరీఫ్‌ నాటికి సిద్ధం కావాలని నిర్దేశించారు. అలాగే గ్రామస్థాయిలో పంట ఉత్పత్తుల గ్రేడింగ్, ప్యాకింగ్‌ జరిగితే మంచి ఫలితాలు వస్తాయని అన్నారు.

ఆక్వా రైతులకు సర్టిఫై విత్తనాలు ఇవ్వాలి

ఆక్వా రైతులకు నాణ్యమైన ఫీడు, సీడు అందించాలని సీఎం స్పష్టం చేశారు. సర్టిఫై చేసిన విత్తనాలు మాత్రమే రైతులకు ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. మార్కెట్ ‌యార్డులను మరింత ఉపయోగకరంగా వాడుకోవాలని అన్నారు. అనుసరించాల్సిన అంశాలపై ప్రణాళికలు సిద్ధం చేయాలని చెప్పారు. జనతా బజార్లు కూడా మార్కెట్‌యార్డు‌లతో కనెక్టివిటీ ఉండేలా చూడాలని నిర్దేశించారు.

ఇదీ చదవండి..

'భవిష్యత్తులో కరోనాతో కలిసి జీవించాల్సి ఉంటుంది'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.