ETV Bharat / state

రోగులను సరైన ఆస్పత్రికి పంపించే బాధ్యత ఆరోగ్యమిత్రదే: సీఎం

author img

By

Published : Sep 4, 2020, 3:26 PM IST

Updated : Sep 4, 2020, 4:18 PM IST

కరోనా విస్తరిస్తోన్న దృష్ట్యా ఆరోగ్య శ్రీ పథకాన్ని ప్రైవేటు ఆస్పత్రుల్లో తప్పని సరిగా అమలు చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అధికారులను ఆదేశించారు. పథకాన్ని వర్తింపజేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోన్న ప్రైవేటు ఆస్పత్రులపై వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. ప్రతి ఆరోగ్య శ్రీ ఆస్పత్రిలో హెల్ప్ డెస్క్ తప్పని సరిగా ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఖాళీగా ఉన్న వైద్యులు, సిబ్బందిని వేగంగాభర్తీచేయాలని తెలిపారు.

cm_review
cm_review

కరోనా నివారణ, సహాయక పరిస్ధితులపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అధికారులతో సమీక్షించారు. రాష్ట్రంలోని అన్ని ఆరోగ్యశ్రీ ఆస్పత్రుల్లో పథకాన్ని నీరు గార్చేలా వ్యవహరిస్తున్న ఆస్పత్రులపై కఠిన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ఎక్కడ తప్పులు జరిగినా వెంటనే చర్యలు తీసుకోవాలని సూచించారు. అమలుపై ఎప్పటికప్పడు అధికారులు నిశిత పర్యవేక్షణ చేయాలన్నారు. ఆరోగ్యశ్రీలో నమోదైన ప్రతి ఆస్పత్రిలోనూ హెల్ప్‌ డెస్క్‌ ఖచ్చితంగా ఉండాలని తెలిపారు. ఆరోగ్య మిత్రలతో వీటిని ఏర్పాటు చేయాలని నిర్దేశించారు. రిఫరల్‌ విధానం చాలా సమర్థవంతంగా ఉండాలన్న సీఎం.. ఆస్పత్రిలో మౌలిక సదుపాయాల మీద, వైద్య సేవల నాణ్యత మీద ఎప్పటికప్పుడు ఫీడ్‌ బ్యాక్‌ తీసుకోవాలని సూచించారు.

ఆరోగ్య సేవలపై రోగుల ఫీడ్ బ్యాక్ తీసుకోవాలి...

ఆరోగ్యశ్రీ పథకంలో చికిత్స పొందిన వారికి ఆరోగ్య ఆసరా ఇస్తున్నారా? లేదా? అనే విషయాన్ని ఆరోగ్య మిత్రలు చూసి అందుతోన్న సేవలపై రోగుల నుంచి ఫీడ్ బ్యాక్ తీసుకోవాలని ఆదేశించారు. ఆహారం, శానిటేషన్, డాక్టర్లు, మౌలిక సదుపాయాలు.. ఈ నాలుగింటిపై ప్రశ్నలు వేసి.. రోగుల నుంచి ఫీడ్‌ బ్యాక్‌ తీసుకోవాలన్నారు. వీటి ద్వారానే ఆస్పత్రులకు రేటింగ్‌ ఇవ్వాలన్నారు. ఎక్కడైనా వాటిలో లోపాలు గుర్తిస్తే వెంటనే పరిస్థితులను మెరుగుపరిచేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. అలాగే ఆరోగ్య ఆసరా మీదా ఫీడ్‌ బ్యాక్‌ తీసుకోవాలని .. ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై రోగులంతా సంతృప్తి వ్యక్తం చేయాన్నారు. ఆరోగ్యశ్రీ కింద నమోదైన ఆస్పత్రుల్లోనూ.. ఇదే రకమైన ఫీడ్‌ బ్యాక్‌ తీసుకోవాలని సీఎం సూచించారు.

కొవిడ్‌ ఆస్పత్రుపై ఎలాంటి సమీక్ష చేస్తున్నామో అన్ని ఆరోగ్యశ్రీ ఆస్పత్రులు, ఆ పథకంలో నమోదైన ఆస్పత్రులపై సమీక్ష చేయాలన్నారు. రోగులకు సరైన ఆస్పత్రికి పంపించే బాధ్యత ఆరోగ్యమిత్రలదేనని సీఎం అన్నారు. రోగుల సంతృప్తి చెందేలా ఆరోగ్యమిత్రలు సేవలు అందించేలా చూడాలన్నారు. ఈ అంశాలన్నింటిపై పూర్తి స్థాయి దృష్టి పెట్టాలన్న సీఎం జగన్.. వచ్చే సమావేశం నాటికి చెప్పిన విధానాలకు సంబంధించి పురోగతి వివరించాలని ఆదేశించారు. కరోనా పై ప్రజలకు అవగాహన పెంచేందుకు ప్రచార కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు.

రాష్ట్రంలో కొవిడ్ పై రోజుకు రూ.10.18 కోట్లు ఖర్చు...

రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటు చేస్తున్న టీచింగ్‌ ఆస్పత్రుల నిర్మాణానికి వెంటనే చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. అర్బన్‌ హెల్త్‌ సెంటర్ల నిర్మాణంపైనా చర్యలు తీసుకోవాలన్నారు. అక్టోబరు నాటికి వాటి టెండర్ల ప్రక్రియ ముగిస్తామని అధికారులు స్పష్టం చేశారు. కొవిడ్‌ ఆస్పత్రులు, వాటిలో బెడ్లు, నిర్వహణ, సిబ్బంది నియామకాలపై సమావేశంలో అధికారులు సీఎంకు వివరించారు. కొవిడ్‌ ఆస్పత్రుల్లో 37,441 బెడ్లు ఉన్నాయని వాటిలో శుక్రవారం నాటికి సాధారణ బెడ్లు 2462, ఆక్సిజన్‌ సపోర్టుతో ఉన్న బెడ్లు 11,177, ఐసీయూ బెడ్లు 2,651 ఖాళీగా ఉన్నాయని వివరించారు. మొత్తం 30,887 పోస్టులకు గానూ 21,673 తాత్కాలిక ప్రాతిపదికన భర్తీ చేశామనని తెలిపారు. రెగ్యులర్‌ రిక్రూట్‌మెంట్‌లో 9,971 పోస్టులు ఉండగా వీటిలో 4,676 పోస్టులలో నియామకం పూర్తైందని , 5,295 పోస్టుల భర్తీకి ప్రక్రియ కొనసాగుతుందన్నారు. మరో 10 రోజుల్లో ఆ పోస్టుల భర్తీ పూర్తవుతుందన్న అధికారులు తెలిపారు. కొవిడ్‌పై ప్రస్తుతం ప్రతి రోజూ రూ.10.18 కోట్లు ఖర్చవుతోందని.. అందులో కొవిడ్‌ టెస్టుల కోసం రూ.4.3 కోట్లు ,ఆహారం కోసం రూ.1.31 కోట్లు, మందులు కోసం రూ.4.57 కోట్లు వ్యయం చేస్తున్నట్లు అధికారులు సీఎంకు తెలిపారు.తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో జరిగిన సమీక్షకు ఉపమఖ్యమంత్రి , వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని, సీఎస్‌ నీలం సాహ్ని, వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కెఎస్‌ జవహర్‌రెడ్డితో పాటు, పలువురు సీనియర్‌ అధికారులు పాల్గొన్నారు.

ఇదీ చదవండి:

బాణసంచా కర్మాగారంలో పేలుడు- 9 మంది మృతి

Last Updated : Sep 4, 2020, 4:18 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.