ETV Bharat / state

CM Jagan Neglect on Development of Urdu Language: నవంబరులో ఉత్తమ ఉర్దూ ఉపాధ్యాయులు, మెరిట్‌ విద్యార్థుల ఎంపిక.. 11 నెలలు దాటినా.. - Urdu language Situation in AP

CM Jagan Neglect on Development of Urdu Language: ఉర్దూ భాషాను తామే ఉద్దరిస్తున్నామని.. సీఎం జగన్, ఉప ముఖ్యమంత్రి అంజాద్ బాషా తరచూ డప్పుకొట్టుకుంటారు. నిజంగా వారెంత పాటుపడుతున్నారో తెలిస్తే ఆశ్చర్యం కలగక మానదు. ఉత్తమ ఉర్దూ ఉపాధ్యాయులు, ప్రతిభ చూపిన విద్యార్థులకు గతేడాది నవంబర్ 11న ప్రకటించిన అవార్డులకు సంబంధించిన నగదు ప్రోత్సాహకాన్ని ఇప్పటికీ విడుదల చేయలేదు. 11 నెలలు దాటినా విడుదల చేయలేనంత పెద్ద మొత్తమా అంటే అది కేవలం 7 లక్షల రూపాయలే. ఇదీ మన ప్రభుత్వ సామాజిక సాధికారత అంటే..!

CM_Jagan_Neglect_on_Development_of_Urdu_Language

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Oct 27, 2023, 8:59 AM IST

CM Jagan Neglect on Development of Urdu Language: నవంబరులో ఉత్తమ ఉర్దూ ఉపాధ్యాయులు, మెరిట్‌ విద్యార్థుల ఎంపిక.. 11 నెలలు దాటినా నగదు విడుదల చేయని జగన్

CM Jagan Neglect on Development of Urdu Language : ఉర్దూ భాషాభివృద్ధికి ఎవరూ చేయని కృషి తామే చేస్తున్నట్లు.. వైఎస్సార్సీపీ ప్రభుత్వం ప్రచారం చేసుకుంటోంది. కానీ వాస్తవాలు పరిశీలిస్తే గతేడాది నవంబర్ 11న మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతి పురస్కరించుకుని గుంటూరులో ఆర్భాటంగా నిర్వహించిన సమావేశంలో సీఎం జగన్‌ అవార్డులు ప్రదానం చేశారు. కొన్ని అవార్డులకు ఎంపికైన వారికి నేరుగా నగదును అందించారు. ఉత్తమ ఉర్దూ ఉపాధ్యాయులు, మెరిట్ విద్యార్థులకు మాత్రం ఆ తర్వాత బ్యాంకు ఖాతాల్లో నేరుగా జమ చేస్తామని చెప్పి పంపారు. రాష్ట్ర వ్యాప్తంగా 49 మంది ఉత్తమ ఉపాధ్యా యుల్ని, దాదాపుగా అదే సంఖ్యలో విద్యా ర్థుల్ని ఎంపిక చేశారు. ఒక్కో ఉపాధ్యాయునికి 10 వేల రూపాయలు, ఒక్కో విద్యార్థికి 5 వేల రూపాయల చొప్పున ప్రోత్సాహకాన్ని అందించాలి. దాదాపు ఏడాదవుతున్నా ఆ మొత్తం ఇప్పటికీ జమ కాలేదు.

నవంబర్‌లో అవార్డుల ప్రదానం.. మేలో బిల్లు పెట్టడమా! : పని చేయకుండానే ప్రచారాన్ని పొందటంలో జగనన్నను మించినవారు మరొకరు ఉండరేమో. కోట్ల రూపాయల అప్పులు తెస్తున్నా పిల్లల్ని ప్రోత్సహించేందుకు ఆ మాత్రం డబ్బులివ్వడానికీ జగన్ మామయ్యకు చేతులు రాలేదు. గతేడాది అవార్డుల డబ్బులే ఇవ్వని ప్రభుత్వం ఈ ఏడాది నవంబర్ 11న అవార్డులు ప్రదానం చేసేందుకు ఉత్తమ ఉర్దూ ఉపాధ్యాయులు, ప్రతిభ కనబరిచిన విద్యార్థుల ఎంపిక కోసం తాజాగా నోటిఫికేషన్ విడుదల చేసింది. పైగా ఇవేమీ ప్రజలకు తెలియదన్నట్టు.. నాలుగున్నరేళ్ల పాలనలో ముస్లింలను ఉద్దరించేసినట్టు సామాజిక సాధికారత యాత్ర కూడా చేపట్టగల ఘనాపాఠీ సీఎం జగన్.

Kurnool Urdu Univeristy: చంద్రబాబు ప్రారంభించారని జగన్ వదిలేేశారు..! ఉర్దూ వర్సిటీ భవిత అగమ్యగోచరం

Development of Urdu Language in AP : ఏ ప్రభుత్వమైనా అవార్డులు, ప్రోత్సాహకాలు ఇవ్వాలంటే ముందుగానే నిధులు సిద్ధం చేసుకుంటుంది. అదే రోజు వేదిక మీద నగదుగానో, చెక్కు రూపంలోనే అందజేస్తారు.లేదంటే ఓ వారం, పది రోజుల్లో నిధులు విడుదలయ్యేలా చూసుకుంటారు. కానీ జగన్ ప్రభుత్వం.. నవంబర్‌లో అవార్డుల ప్రదానోత్సవం జరిగితే ఉపాధ్యాయులు, విద్యార్థులకు విడుదల చేయాల్సిన 7 లక్షల రూపాయల బిల్లును.. ఆ తర్వాత 6 నెలలకు మేలో CFMS (Comprehensive Financial Management System)లో పెట్టినట్లు తెలిసింది. ఆ తర్వాత మరో ఆర్నెల్లు గడుస్తున్నా అతీగతీ లేదు. ఇప్పుడు మళ్లీ అవార్డులకు ఎంపిక అంటూ.. పెద్ద ఎత్తున ప్రచారానికి నడుంకడుతున్న ప్రభుత్వం.. పాత ప్రోత్సాహకాలు విడుదల చేయకపోతే విమర్శలొస్తాయని జాగ్రత్త పడుతోంది. రెండు, మూడు రోజుల్లో ప్రోత్సహకాలు చెల్లిస్తామని అధికారులు చెబుతున్నారు.

నిధుల కొరత.. పని చేయని ఉర్దూ కంప్యూటర్​ శిక్షణ కేంద్రాలు

Farooq Shibli Fire on YSRCP Government : గతేడాది నవంబర్ 11న ప్రకటించిన అవార్డుల మొత్తాన్ని ఇప్పటికీ ఇవ్వకపోవడంపై మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షుడు ఫరూఖ్ షిబ్లీ ఆగ్రహం వ్యక్తం చేశారు. 11 నెలలైనా ప్రోత్సాహకాన్ని విడుదల చేయక పోవడమేనా వైఎస్సార్సీపీ ప్రభుత్వం సాధించిన సాధికారత అంటూ ప్రశ్నించారు. మంత్రులు చేపడుతున్న బస్సు యాత్రలో (YCP Bus yatra) ఈ విషయాన్ని కూడా ప్రజలకు వివరించాలని డిమాండ్‌ చేరారు.

ఉర్దూ శిక్షణ కేంద్రాలకు అందని నిధులు..

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.