ETV Bharat / state

ఎవరి టికెట్ చిరుగుతుందో! - జగన్​ క్యాంపు కార్యాలయంలో వైసీపీ ఎమ్మెల్యేల నిరీక్షణ - సీఎం జగన్

CM Jagan meeting with ministers and MLAs: సీఎం గత కొద్ది రోజులుగా ఆయా జిల్లాల నేతలతో భేటీ అవుతున్నారు. ఈ నేపథ్యంలో నేడు సీఎం జగన్​ కర్నూలు, చిత్తూరు, శ్రీకాకుళం ఎమ్మెల్యేలతో సీఎం భేటీ కానున్నారు. సీఎంతో భేటీకన్నా ముందు పలువురు ఎమ్మెల్యేలు సజ్జల రామకృష్ణారెడ్డితో భేటీ అయ్యారు. సజ్జలను కలిసిన వారిలో బ్రిజేందర్ రెడ్డి, నవాజ్ పాషా, మధుసూదన్‌ రెడ్డి, ఎంపీ మార్గాని భరత్ తదితరులు ఉన్నారు.

CM Jagan meeting with ministers and MLAs

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Dec 20, 2023, 4:53 PM IST

CM Jagan meeting with ministers and MLAs: ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో వైసీపీలో సంస్కరణలు చేపట్టింది. వైసీపీకి చెందిన మంత్రులు, ఎమ్మెల్యేల మార్పుపై గత కొద్ది రోజులుగా వైసీపీ నేతలు కసరత్తు చేస్తున్నారు. అందుకు తగ్గట్టుగా సీఎం జగన్ (CM Jagan) పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలతో భేటీ అవ్వడం, ఆయా నియోజకవర్గాల్లో వారి పనితీరు, ప్రజా వ్యతిరేకత, స్థానిక న్యాయకత్వం తదితర అంశాలపై చర్చిస్తున్నారు. రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో సీటు ఇచ్చే అవకాశం ఉందా లేదా అన్న అంశాన్ని వెల్లడిస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా కర్నూలు, చిత్తూరు, శ్రీకాకుళం ఎమ్మెల్యేలతో సీఎం భేటీ కానున్నారు. సీఎం భేటీకన్నా ముందుగా ప్రభుత్వ ప్రధానసలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి వారితో భేటీ అయ్యారు.

వైసీపీ ఇన్‌ఛార్జుల మార్పుపై జగన్​ కసరత్తు - నేతలలో ఉత్కంఠ

సజ్జలతో భేటీ అయిన పలువురు ఎమ్మెల్యేలు: సీఎం క్యాంపు కార్యాలయానికి వచ్చిన పలువురు ఎమ్మెల్యేలతో ఏపీ ప్రభుత్వ ప్రధాన సలహాదారు సజ్జల రామకృష్ణరెడ్డి (Sajjala Ramakrishna Reddy) మంతనాలు జరుపుతున్నారు. సీఎం కార్యాలయానికి వచ్చిన వారిలో బ్రిజేందర్ రెడ్డి, నవాజ్ పాషా, మధుసూదన్‌ రెడ్డి, ఎంపీ మార్గాని భరత్ తదితరులు ఉన్నారు. సజ్జల రామకృష్ణారెడ్డి ఒక్కొక్కరితో భేటీ అవుతోన్నారు. సజ్జలతో భేటీ అయిన తరువాత సీఎం జగన్‌తో ఎమ్మెల్యేలు భేటీ అయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

విజయవాడ పశ్చిమ సీటుపై.. మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ (Former minister Vellampalli Srinivas) సీఎం క్యాంపు కార్యాలయానికి వచ్చారు. అనంతరం వెల్లంపల్లి మీడియాతో మాట్లాడారు. విజయవాడ పశ్చిమ సీటు తనదేనని దీమా వ్యక్తం చేశారు. కొందరు తన సీటు మార్పుపై అనవసరంగా లేనిపోని ప్రచారం చేస్తున్నారని వెల్లంపల్లి ఆగ్రహం వ్యక్తం చేశారు. తన నియోజకవర్గంలోని అభివృద్ధి పనులకు సంబంధించిన నిధుల కోసం సీఎంవో అధికారులను కలినట్లు తెలిపారు. సీటు మార్పు అంశంపై సీఎం జగన్ ఏ నిర్ణయం తీసుకున్నా కట్టుబడి ఉంటానని వెల్లంపల్లి శ్రీనివాస్‌ వెల్లడించారు.

సీట్ల మార్పుపై వైఎస్సార్సీపీ నాయకుల ఆగ్రహం - కార్యకర్తలను కరివేపాకులా తీసివేస్తున్నారని అసహనం

దళిత నేతలతో సీఎం జగన్ భేటీ: వైసీపీలోని దళిత నాయకులతో ( Dalit leaders ) సీఎం జగన్ సమావేశం అయ్యారు. గత కొన్ని రోజులుగా రాబోయే ఎన్నికల్లో ఎస్సీ రిజర్వుడు నియోజకవర్గాల నేతలను మారుస్తారనే వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సందర్భంగా ఆయా నియోజకవర్గాలలో దళిత నేతలతో సమావేశం కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ భేటీలో దళిత నేతల అభిప్రాయాలు తీసుకుంటారనే వార్తలు వినిపిస్తున్నాయి. ఆయా స్థానాల్లో ఎమ్మెల్యే అభ్యర్థులను మారిస్తే వచ్చే పరిణామాలపై సీఎం జగన్ వారితో చర్చిస్తున్నట్లు తెలుస్తోంది.

వైఎస్సార్సీపీ సిట్టింగ్​ ఎమ్మెల్యేలలో సీటు భయం - సీఎం క్యాంపు కార్యాలయానికి మంత్రులు, ఎమ్మెల్యేల క్యూ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.