ETV Bharat / state

'తెలంగాణకు అడ్డు చెప్పరు... మమ్మల్నెలా వద్దంటారు?' - సీఎం జగన్ తాజా వార్తలు

రాయలసీమ ఎత్తిపోతలపై ఏపీని నియంత్రిస్తున్న కేంద్రం..... తెలంగాణ కొత్త ప్రాజెక్టులు కడుతుంటే ఎందుకు అడ్డుకోలేదని ముఖ్యమంత్రి జగన్‌ ప్రశ్నించారు. రాష్ట్రానికి కేంద్రం రాసిన లేఖకు ప్రత్యుత్తరం పంపిన ఆయన.... రాయలసీమ ప్రాజెక్టు కొత్తది కానే కాదని తేల్చి చెప్పారు. అపెక్స్‌ కౌన్సిల్ భేటీకి తమ అజెండా సిద్ధమని తెలిపారు.

cm jagan
cm jagan
author img

By

Published : Aug 12, 2020, 5:08 AM IST

Updated : Aug 12, 2020, 7:53 AM IST

రాయలసీమ ఎత్తిపోతల ప్రాజెక్టు నిర్మాణాన్ని నియంత్రించేందుకు ప్రయత్నిస్తున్న కేంద్రం..... తెలంగాణ కొత్త ప్రాజెక్టులు కడుతుంటే మాత్రం ఎప్పుడూ అడ్డు చెప్పలేదేమని ఏపీ ముఖ్యమంత్రి జగన్‌ ప్రశ్నించారు. కొత్త ఆయకట్టు కోసం తెలంగాణ కొత్త ప్రాజెక్టులు నిర్మిస్తున్నా... వాటిని ఆపేందుకు 2016 నుంచి ఇప్పటిదాకా అపెక్స్‌ కౌన్సిల్‌ ఉత్తర్వులు ఇవ్వలేదన్నారు. రాయలసీమ ఎత్తిపోతల కొత్తది కానే కాదని... దాని కింద కొత్త ఆయకట్టు, జలాశయాలు, కాలువలు లేవన్నారు. తెలంగాణ ఓవైపు 800 అడుగుల నీటిమట్టం నుంచి 4 ప్రాజెక్టులకు రోజుకు 3 టీఎంసీల నీటిని తీసుకునేలా ప్రాజెక్టులు నిర్మిస్తోందన్నారు. మరోవైపు 796 అడుగుల వద్దే విద్యుదుత్పత్తి పేరిట నీటిని తీసుకుంటోందన్నారు. అదే 800 అడుగుల వద్ద తమ కేటాయింపుల నుంచి నీటిని వాడుకునేందుకు ఎత్తిపోతల నిర్మిస్తుంటే అభ్యంతరం ఎందుకని జగన్‌ ప్రశ్నించారు. ఈ అంశాలన్నీ ప్రస్తావిస్తూ కేంద్ర జల్‌శక్తి మంత్రి గజేంద్రసింగ్ షెకావత్‌కు మంగళవారం లేఖ రాశారు.

షెకావత్​ జీ...

మీరు ఆగస్టు 7న రాసిన లేఖ అందింది. రెండో అపెక్స్ కౌన్సిల్ సమావేశం ఆగస్టు 5న ప్రతిపాదిస్తూ మీరు లేఖ రాస్తే ఆంధ్రప్రదేశ్ స్పందించలేదని అందులో ప్రస్తావించారు. అది నిజం కాదు. ఆ భేటీకి నేను సిద్ధమని తెలియచేసినా అంది మీ దృష్టికి రాలేదు. ఏపీ కొత్త ప్రాజెక్టులేవీ నిర్మించట్లేదు. అవి మొదటి కృష్ణా ట్రైబ్యునల్ కేటాయించిన నీళ్లను మెరుగ్గా వాడుకునేందుకు నిర్మిస్తున్నవే. 2015లో తెలంగాణతో కుదిరిన ఒప్పందం మేరకు ఉన్న నీటి కేటాయింపులనే వినియోగించుకుంటాం. అపాయింటెడ్‌ డే నాటికి ఉన్న, కొత్త ప్రాజెక్టులకు ట్రైబ్యునల్‌ నిర్దేశించిన నీటి కేటాయింపులకు ఇబ్బంది లేకుండా కొత్త ప్రాజెక్టులు నిర్మించుకోవాలని.... ఈ విషయాన్ని కృష్ణా, గోదావరి బోర్డులు పరిశీలించాక అపెక్స్ కౌన్సిల్‌ ఆమోదించాలని పునర్‌వ్యవస్థీకరణ చట్టం చెబుతోంది. ఆ లెక్కన రాయలసీమ ఎత్తిపోతల పథకం కొత్తది కాదు.

  • కృష్ణా నదిపై తెలంగాణ నిర్మిస్తున్న పాలమూరు-రంగారెడ్డి, దిండి ఎత్తిపోతలపై సుప్రీంలో స్పెషల్​ లీవ్ పిటిషన్​లు దాఖలయ్యాయి. ఈ వివాద పరిష్కార బాధ్యతను కోర్టు అపెక్స్ కౌన్సిల్‌కు అప్పచెప్పింది. తొలి భేటీలో చెప్పిన మాటకు తెలంగాణ నిలబడలేదు. 2016 నుంచి వాళ్లు కొత్త ప్రాజెక్టులు కడుతున్నా నిలిపివేతకు అపెక్స్ కౌన్సిల్‌ ఆదేశాలివ్వలేదు. అపెక్స్ కౌన్సిల్ రెండో సమావేశానికి ఏపీ ఎన్నో సార్లు కోరినా ఫలితం లేదు.
  • తెలంగాణ నాలుగు కొత్త ప్రాజెక్టులు నిర్మిస్తోంది. శ్రీశైలంపై 800, 796 అడుగుల వద్ద వేర్వేరు ప్రాజెక్టుల నుంచి నీటిని తోడుకుంటోంది. ఫలితంగా రాయలసీమ జిల్లాలకు ఇబ్బంది ఏర్పడుతోంది. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ కేసీ కాలువకు, ఎస్​ఆర్​బీసీకి, తెలుగుగంగ, గాలేరు నగరి ప్రాజెక్టులకు అనుబంధం మాత్రమే. ఇక్కడ నీటిని ఎత్తిపోయడం ఏడాదిలో 10-15 రోజులే వీలవుతుంది. మొదటి కృష్ణా ట్రైబ్యునల్ కేటాయింపుల ప్రకారం ఏపీ తన వాటాను వాడుకోలేకపోతోంది.
  • కొత్త ప్రాజెక్టులు వద్దని 2020 మే 30న కృష్ణా బోర్డు తెలంగాణకు నిర్దేశించింది. తెలంగాణ 800 అడుగుల వద్ద అన్ని ప్రాజెక్టులకు నీళ్లు తీసుకుంటూ, మరోవైపు 854 అడుగులకు ఎగువన ఉన్న నీటినే తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్​కు చెప్పడం ఎంతవరకు సబబు?
  • గోదావరిపైనా తెలంగాణ కొత్త ప్రాజెక్టులపై గోదావరి బోర్డు సమావేశంలోచర్చ జరిగింది. వీటికి అపెక్స్ కౌన్సిల్ ఆమోదం ఇవ్వాలి. ఈ ప్రాజెక్టులూ ఏపీ ప్రయోజనాలకు విరుద్ధం.
  • ప్రస్తుతం రోజుకు 3 టీఎంసీలు ఎత్తిపోసేలా రాయలసీమ ఎత్తిపోతల నిర్మాణం తప్ప గత్యంతరం లేదు. రాష్ట్ర పునర్​వ్యవస్థీకరణ చట్టం ప్రకారం 11వ షెడ్యూలు పదో పేరాలో పేర్కొన్న ప్రాజక్టులకు ట్రైబ్యునల్ కేటాయింపులకు లోబడి నీటిని వాడుకుంటాం. అపెక్స్ కౌన్సిల్ దీనిపై పునరాలోచించాలి. రాయలసీమ ఎత్తిపోతలపై నిషేదం లేకుండా చూడాలి

ఇదీ చదవండి

50 శాతం జీతాలు, పెన్షన్లు చెల్లించాలన్న ప్రభుత్వ జీవోలు కొట్టివేత

Last Updated : Aug 12, 2020, 7:53 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.