Three capitals in AP: నాడు ప్రతి పక్ష నేతగా అమరావతి రాజధానికి అంగీకరించిన ప్రస్తుత సీఎం జగన్.. ప్రస్తుతం మూడు రాజధానుల పేరిట రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తున్నారని, అమరావతి రైతులు అన్నారు. అమరావతి రైతుల పోరాటంపై పోలీసుల నిర్బంధాలు, ప్రజాప్రతినిధుల దమనకాండ, దుష్ప్రచారానికి వ్యతిరేకంగా..హైదరాబాద్ బాగ్‌లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో రైతాంగ పోరాట వేదిక సదస్సు నిర్వహించింది.
అమరావతే రాజధాని అని న్యాయస్థానాలు ఇచ్చిన తీర్పును సైతం పట్టించుకోకపోవడంతోనే తాము మహా పాదయాత్ర చేపట్టామని తెలిపారు. అందుకూ నిబంధనల పేరుతో అడ్డంకులు సృష్టిస్తున్నారని వాపోయారు. నోరు తెరిస్తే అక్కా చెల్లెమ్మలు అని మాట్లాడే సీఎం జగన్.. అమరావతి పోరాటంలో 2వేలకు పైగా మహిళలపై కేసులు పెట్టారన్నారు. ఎన్ని నిర్బంధాలు పెట్టినా వెనకడుగు వేసే ప్రసక్తే లేదన్న రైతులు, అమరావతిని సాధించే వరకూ పోరాటం ఆగబోదని స్పష్టంచేశారు.
ఇవీ చదవండి: