ETV Bharat / state

CM Jagan At YSR Pension: ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తున్నాం: సీఎం జగన్​ - cm jagan guntur tour

CM Jagan on New Pensions: వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, మత్స్యకారులు తదితరులకు వైఎస్సార్‌ పెన్షన్‌ కానుక రూ.2,500కు పెంపు కార్యక్రమంలో సీఎం జగన్​ పాల్గొన్నారు. అధికారంలోకి రాగానే పింఛన్‌ రూ.2,250కు పెంచడమే కాకుండా.. రెండున్నరేళ్లలో రూ.2,500 ఇస్తున్నామని వెల్లడించారు. ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తున్నామని జగన్​ అన్నారు.

cm jagan
cm jagan
author img

By

Published : Jan 1, 2022, 12:52 PM IST

Updated : Jan 2, 2022, 4:14 AM IST

Hiked Pension distribution at Prathipadu: రాష్ట్రంలో పేదలకు మంచి చేస్తుంటే ప్రతిపక్ష పార్టీలు, కొందరు నాయకులు ఓర్వలేకపోతున్నారు. తమకు తాముగా జీవితమంతా కష్టపడినా 4 రూపాయలు మిగుల్చుకోలేని నిర్భాగ్యుల కష్టాలు వారికి తెలుసా? పిల్లల నుంచి ఆదరణ లేక వృద్ధాప్యంలో.. కుల, చేతివృత్తులకు జీవితాలు ధారపోసి ఇక కొనసాగించలేక ఆర్థికంగా ఆధారం కరవై జీవితం ప్రశ్నార్థకంగా మారిన వారి ఇబ్బందులు తెలుసా’ అని ముఖ్యమంత్రి వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి ప్రశ్నించారు. సామాజిక భద్రత పింఛన్లను రూ.2,250 నుంచి రూ.2,500కు పెంచే కార్యక్రమానికి శనివారం సీఎం జగన్‌ గుంటూరు జిల్లా ప్రత్తిపాడు నుంచి శ్రీకారం చుట్టారు. మధ్యాహ్నం 12.28 గంటలకు పెన్షన్ల పెంపును ప్రారంభించారు. అంతకుముందు సభ వద్ద ఏర్పాటు చేసిన స్టాళ్లను పరిశీలించి ఉద్యోగులతో మాట్లాడారు. పెన్షన్ల లబ్ధిదారులను పలకరించి వారితో ఫొటో దిగారు. జనవరి 1 సందర్భంగా రాష్ట్రంలోని ప్రతి అవ్వ, తాతకు, అక్క, చెల్లెమ్మ, సోదరుడు, సోదరికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నానని పేర్కొన్నారు. అనంతరం బహిరంగ సభలో ప్రసంగించారు. దశల వారీగా పెన్షన్‌ను రూ.3 వేలు చేస్తామని ఎన్నికల మ్యానిఫెస్టోలో అవ్వాతాతలకు హామీ ఇచ్చామని, అందులో భాగంగానే సీఎంగా బాధ్యతలు స్వీకరించిన రోజే రూ.2,250కు పెంచుతూ తొలి సంతకం చేసినట్లు గుర్తు చేశారు. రెండున్నరేళ్ల తర్వాత ఇప్పుడు రూ.2,500కు పెంచామని తెలిపారు.

.

62 లక్షల కుటుంబాల్లో చిరునవ్వులు

పెన్షన్‌ పెంపుతో 62 లక్షల కుటుంబాల్లో చిరునవ్వులు రాబోతున్నాయని సీఎం జగన్‌ తెలిపారు. ఇచ్చినమాట ప్రకారం రూ.3 వేలకు పెంచుకుంటూ పోతామని అన్నారు. ‘ప్రత్తిపాడు నియోజకవర్గంలో మీ అందరి ఎదుట ఈ కార్యక్రమాన్ని ప్రారంభించటం చాలా సంతోషంగా ఉంది. రాష్ట్రవ్యాప్తంగా వాలంటీర్లు ప్రతి ఇంటికీ వెళ్లి శుభోదయం చెప్పి పెన్షన్లు అందజేస్తున్నారు. గత ప్రభుత్వం ఎన్నికలకు రెండు నెలల ముందు వరకు రూ.1000 పెన్షన్‌ను 39 లక్షల మందికే ఇచ్చింది. నేను సీఎంగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత పెన్షన్‌ను రూ.2,250కి పెంచాం. ప్రస్తుతం 62 లక్షల మందికి అందజేస్తున్నాం. గతంలో పెన్షన్ల కోసం నెలకు రూ.400 కోట్లు ఖర్చు చేయగా.. ప్రస్తుతం రూ.1,450 కోట్లు ఖర్చు చేస్తున్నాం. ఈ నెల నుంచి రూ.1,570 కోట్లకు పెంచుతున్నాం. 31 నెలల పాలనలో కరోనా కాలంలోనూ పేదవారి కష్టాలు గుర్తించి రూ.40వేల కోట్లను పెన్షన్ల కోసం ఖర్చు చేశాం. ప్రతి నెలా ఒకటో తేదీన మీ గడప ముందుకు వచ్చి పెన్షన్‌ ఇచ్చే పరిస్థితిని ఊహించారా?’ అని సీఎం జగన్‌ లబ్ధిదారులను అడిగారు. ఆదివారమైనా, సెలవు రోజైనా పెన్షన్‌ చెల్లిస్తున్నామని.. నెలలో 1వ తేదీనే 95 శాతం మంది లబ్ధిదారులకు.. మిగిలిన వారికి 5వ తేదీ లోపు పంపిణీకి శ్రీకారం చుడుతున్నామని వెల్లడించారు.

.

అభివృద్ధి కార్యక్రమాలకు అడ్డు

‘మంచి చేసిన చరిత్ర లేని పార్టీలు, నాయకులు మమ్మల్ని విమర్శిస్తున్నారు. పేద పిల్లలకు ఇంగ్లిష్‌ చదువులు చెప్పించాలని ఆలోచన చేస్తే అడ్డుకుంటున్నారు. పేదలకు ఇళ్ల స్థలాల రూపంలో రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షల ఆస్తిని వారికి ఇస్తుంటే న్యాయస్థానాలకు వెళ్లి స్టే తీసుకువచ్చే మనస్తత్వం కలిగినవారు విమర్శిస్తున్నారు. అమరావతి అని చెబుతున్న రాజధానిలో పేదలకు ఇళ్లస్థలాలు ఇవ్వాలని ఆరాటపడితే కులాల మధ్య మార్పులు చేర్పులు వస్తాయని కోర్టులో పిటిషన్లు వేస్తారు. ఇంతకంటే దౌర్భాగ్యమైన నాయకులు ఉంటారా’ అని జగన్‌ ప్రశ్నించారు. ‘పేదవాడికి అందుబాటు రేటుకు వినోదం అందించాలని సినిమా టికెట్ల ధరలు నిర్ణయిస్తే దానిపై రాద్ధాంతం చేస్తున్నారు. ఇలాంటి వాళ్లు పేదల గురించి ఆలోచన చేస్తారా? వీళ్లు శత్రువులు కాదా? దీనిపై అందరూ ఆలోచన చేయాలి. వీరికి ఈ ఏడాదైనా మంచి ఆలోచనలు కలగాలి. నిన్నటి కంటే నేడు బాగుండాలని... నేటి కంటే రేపు బాగుండాలని... రేపటి కంటే నా భవిష్యత్‌ బాగుండాలని కోరుకుంటారు. అటువంటి పాలన చూడాలని ఏ కుటుంబమైనా ఆరాట పడుతుంది. ఆ దిశగా అడుగులు వేస్తూ అభివృద్ధి బాటలో నడిపిస్తున్నామని గర్వంగా తెలియజేస్తున్నా’ అని సీఎం వివరించారు.

అభివృద్ధి పనుల మంజూరు

స్థానిక ఎమ్మెల్యే, రాష్ట్ర హోంశాఖ మంత్రి మేకతోటి సుచరిత.. ప్రత్తిపాడు నియోజకవర్గ అభివృద్ధికి నిధులు కోరగా మంజూరు చేస్తున్నట్లు సీఎం ప్రకటించారు. ఇచ్చిన మాట కోసం ఎంతదూరమైనా వెళ్లగల వ్యక్తి ముఖ్యమంత్రి జగన్‌ అని హోంమంత్రి సుచరిత పేర్కొన్నారు.

.

పెన్షన్ల మంజూరు నిరంతర ప్రక్రియ: పెద్దిరెడ్డి

రాష్ట్రంలో అర్హులందరికీ పెన్షన్లు అందిస్తున్నామని పంచాయతీరాజ్‌శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు. పెన్షన్ల మంజూరు నిరంతర ప్రక్రియగా చేపట్టామన్నారు. పేదవారికి పట్టం కడుతున్న ప్రభుత్వాన్ని ఆదరించాలని కోరారు. ఉపసభాపతి కోన రఘుపతి, పలువురు ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, వివిధ కార్పొరేషన్ల ఛైర్మన్లు పాల్గొన్నారు.

ఫొటోగ్రాఫర్లు, వీడియోగ్రాఫర్లకు అనుమతి నిరాకరణ

ప్రత్తిపాడులో ముఖ్యమంత్రి జగన్‌ పాల్గొన్న బహిరంగసభ కవరేజీకి ఫొటోగ్రాఫర్లు, వీడియోగ్రాఫర్లను యంత్రాంగం అనుమతించలేదు. ఆయా పత్రికలు, టీవీ ఛానల్‌ విలేకరులకే పాసులు జారీచేశారు. కార్యక్రమం ప్రత్యక్షప్రసారం చేయడంతోపాటు ఫొటోలు విడుదల చేస్తున్నందున ఫొటోగ్రాఫర్లు, వీడియోగ్రాఫర్లను అనుమతించలేదని సమాచార పౌర సంబంధాలశాఖ అధికారులు తెలిపారు. కేవలం సాక్షి ఫొటోగ్రాఫర్‌, వీడియోగ్రాఫర్‌ను అధికారులు అనుమతించడం చర్చనీయాంశమైంది.

ఇదీ చదవండి:

Liquor Sales: ఏరులై పారిన మద్యం.. నిన్న ఒక్కరోజే ఎన్ని కోట్ల అమ్మకాలంటే..

Last Updated : Jan 2, 2022, 4:14 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.