రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డాక్టర్ బీఆర్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా.. గవర్నర్ బిశ్వభూషణ్, సీఎం వైఎస్ జగన్ ఘనంగా నివాళులు అర్పించారు. అంబేడ్కర్ చిత్రపటానికి పూల మాలవేసి నివాళులర్పించారు.
సమానత్వం, సామాజిక న్యాయం కోసం కృషి చేసిన డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ సేవలు అజరామరమని గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ కొనియాడారు. అంబేడ్కర్ సిద్ధాంతాలు ఎప్పటికీ ఆదర్శప్రాయమని అన్నారు.
సీఎం జగన్తో పాటు హోంశాఖ మంత్రి మేకతోటి సుచరిత, ఎమ్మెల్యేలు మేరుగ నాగార్జున, చెవిరెడ్డి భాస్కరరెడ్డి, ఎమ్మెల్సీ తలశిల రఘురాం, మాదిగ కార్పొరేషన్ ఛైర్మన్ కె కనకారావు తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చూడండి: CBN TWEET: అంబేడ్కర్ సిద్ధాంతాలు ఎప్పటికీ ఆదర్శ ప్రాయమే..!