గుంటూరులోని ఆంధ్రా లూథరన్ ఇవాంజికల్ చర్చి(ఏఎల్ఈసీ)ల నిర్వహణపై వివాదం పతాకస్థాయికి చేరింది. ఓ వర్గం జరిపిన దాడిలో ఏఎల్ఈసీ సభ్యుడు జాన్ కృపాకర్‌కు తీవ్రగాయాలయ్యాయి. కర్రలు, రాడ్లతో ప్రత్యర్ధులు దాడి చేయడంతో కృపాకర్‌కు గాయాలు కాగా.. వెంటనే జీజీహెచ్‌కు తరలించారు.
గుంటూరు వెస్ట్ పారిస్ చర్చిలో మరోసారి ఇరువర్గాల మధ్య ఘర్షణ జరిగింది. చర్చిపై ఆధిపత్యం కోసం కొన్నిరోజులుగా జేసుదానం, రవికిరణ్ పాస్టర్ల మధ్య ఆధిపత్య పోరు నడుస్తోంది. ఇద్దరు పాస్టర్లకు చర్చిలో ప్రార్థనలు చేసే విషయమై పోటీ నెలకొంది. గతంలో గుంటూరులోని పలు ఏఎల్ఈసీ చర్చిల్లో పరదేశీ బాబు, ఏలియా వర్గాల మధ్య ఆధిపత్యం పోరు నడిచింది.
కృపాకర్‌పై దాడిని పరదేశిబాబు ఖండించారు. పోలీసులు ప్రేక్షకపాత్ర పోషిస్తున్నారని ఆరోపించారు. ఏఎల్ఈసీ మోడరేట్ బిషప్‌గా మే 21న అధికారికంగా కార్యనిర్వహక సభ్యులు తనను ఎన్నుకున్నారని పరదేశీబాబు గుర్తు చేశారు. హైకోర్టు నిర్ణయాన్ని ప్రభుత్వం అమలు చేయాలని కోరారు. మోడరేట్ బిషప్‌గా ఉండటానికి 45-65 ఏళ్ల మధ్య వయసు ఉండాలని.. 70 ఏళ్లు దాటిన ఏలియా బలవంతంగా చర్చిలోకి ప్రవేశిస్తున్నారని పరదేశి బాబు ఆరోపించారు.
ఇదీ చదవండి: ఈస్ట్ పారిస్ చర్చిలో రెండు వర్గాల మధ్య వివాదం.. చక్కదిద్దిన పోలీసులు