అమెరికాలో నల్ల జాతీయుడు జార్జి ప్లాయిడ్ హత్యకు నిరసనగా గుంటూరు శంకర్ విలాస్ కూడలిలో సీఐటీయూ నాయకులు ప్రదర్శనలు చేశారు. నల్ల జాతీయులను అమెరికా హింసలకు గురి చేస్తోందని సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి కాకుమాను నాగేశ్వరరావు అన్నారు. జాతి వివక్షత చూపుతూ దాడులు చేయడం సరికాదన్నారు. మతాలు, కులాలు, జాతుల మధ్య విద్వేషాలు రేపే సంస్కృతికి స్వస్తి పలకాలని డిమాండ్ చేశారు. మానవ హక్కుల పేరుతో దాడులు చేస్తే సహించమన్నారు.
అమెరికా తన ధోరణి మార్చుకోకపోతే ప్రపంచవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతాయని నాగేశ్వరరావు హెచ్చరించారు.
ఇవీ చదవండి: అంత్యక్రియలయ్యాక వచ్చిన నివేదిక..కరోనా పాజిటివ్ నిర్ధరణ