ETV Bharat / state

నలుగురు మార్గదర్శి బ్రాంచి మేనేజర్ల అరెస్టు.. సంతకాలు పెట్టాలంటూ ఒత్తిళ్లు

Margadarsi Branch Managers Arrested: ఆంధ్రప్రదేశ్​లోని మార్గదర్శి చిట్‌ఫండ్‌ బ్రాంచి మేనేజర్లను సీఐడీ అధికారులు ఆదివారం అరెస్టు చేశారు. ఆదివారం కూడా రాష్ట్రంలో ఆరు చోట్ల మార్గదర్శి కార్యాలయాల్లో సోదాలు కొనసాగాయి. విజయవాడ, గుంటూరు, విశాఖ, రాజమహేంద్రవరం మార్గదర్శి బ్రాంచి మేనేజర్లను, కొందరు సిబ్బందిని రాత్రంతా కార్యాలయంలోనే ఉంచి, విచారణ కొనసాగించారు.

Margadarsi Branch Managers Arrested
Margadarsi Branch Managers Arrested
author img

By

Published : Mar 13, 2023, 10:28 AM IST

మార్గదర్శి కార్యాలయాల్లో సోదాలు

Margadarsi Branch Managers Arrested: ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడ, గుంటూరు, విశాఖ, రాజమహేంద్రవరం మార్గదర్శి చిట్‌ఫండ్‌ బ్రాంచి మేనేజర్లను సీఐడీ అధికారులు ఆదివారం అరెస్టు చేశారు. విశాఖపట్నం సీతంపేట బ్రాంచి మేనేజర్‌ కె.రామకృష్ణ, విజయవాడ లబ్బీపేట మేనేజర్‌ శ్రీనివాస్‌లను మేజిస్ట్రేట్ల ముందు హాజరుపరచగా వారికి ఈ నెల 24 వరకు రిమాండ్‌ విధించారు. గుంటూరు మేనేజర్‌కు న్యాయమూర్తి రిమాండ్‌ తిరస్కరించారు.

ఆదివారం కూడా రాష్ట్రంలో ఆరు చోట్ల మార్గదర్శి కార్యాలయాల్లో సోదాలు కొనసాగాయి. విజయవాడ, గుంటూరు, విశాఖ, రాజమహేంద్రవరం మార్గదర్శి బ్రాంచి మేనేజర్లను, కొందరు సిబ్బందిని రాత్రంతా కార్యాలయంలోనే ఉంచి, విచారణ కొనసాగించారు. ఏలూరు, నరసరావుపేట బ్రాంచి కార్యాలయాల్లో ఆదివారం ఉదయమే సీఐడీ అధికారులు వచ్చి రాత్రి 8 గంటల వరకు సోదాలు చేశారు. ఏలూరు కార్యాలయంలోకి సాక్షి మీడియా ప్రతినిధులను తప్ప మిగిలినవారిని రానివ్వలేదు.

ఛాతీలో నొప్పి ఉందన్నా పరీక్షలు చేయించకుండా..

విజయవాడ లబ్బీపేటలోని మార్గదర్శి కార్యాలయంలో సీఐడీ అధికారులు ఆదివారం మధ్యాహ్నం వరకు సోదాలు నిర్వహించారు. మేనేజర్‌ శ్రీనివాస్‌ను అరెస్టు చేస్తున్నామంటూ ఆయనకు లిఖితపూర్వక సమాచారమిచ్చారు. 11 గంటల సమయంలో ఆయన్ను విజయవాడలోని సీఐడీ ప్రాంతీయ కార్యాలయానికి తీసుకెళ్లారు. అక్కడి నుంచి వైద్యపరీక్షల నిమిత్తం విజయవాడలోని బోధనాసుపత్రికి తరలించారు. సమీపంలోని రమేష్‌ ఆసుపత్రికి తీసుకెళ్లి కొవిడ్‌ పరీక్షలు చేయించారు.

ఈ సమయంలో శ్రీనివాస్‌ తనకు ఛాతీలో నొప్పి ఉందని, పరీక్షలు చేయించాలని కోరినా అధికారులు తిరస్కరించారు. కొవిడ్‌ పరీక్షల అనంతరం సీఐడీ ప్రాంతీయ కార్యాలయానికి తీసుకెళ్లారు. రాత్రి 11 గంటల సమయంలో రెండో అదనపు చీఫ్‌ మెట్రోపాలిటన్‌ మేజిస్ట్రేట్‌ సునందమ్మ ముందు హాజరుపరచగా ఈ నెల 24 వరకు రిమాండ్‌ విధించారు. దీంతో పోలీసులు ఆయన్ను విజయవాడ జైలుకు తరలించారు.

బెదిరింపులు, ఒత్తిళ్లు

విశాఖపట్నం సీతంపేట మార్గదర్శి మేనేజర్‌, కొందరు సిబ్బందిని శనివారం రాత్రంతా కార్యాలయంలోనే ఉంచేశారు. ఆదివారమూ ఫైళ్ల తనిఖీలు సాగాయి. అధికారులు డాక్యుమెంట్లు ప్రింట్లు తీసుకుని ఉన్నతాధికారులను సంప్రదిస్తూనే ఉన్నారు. మేనేజర్‌, సిబ్బందితో ఆదివారం వీరు బెదిరింపు ధోరణితో వ్యవహరించారు. సంతకాలు చేయాలని ఒత్తిడి తీసుకువచ్చారు. కనీసం కార్యాలయం గేటు వరకు కూడా వారిని వెళ్లనీయలేదు. సిబ్బంది మరుగుదొడ్డికి వెళ్లినా, నీళ్లు తాగడానికి వెళ్లినా కానిస్టేబుళ్లను కాపలా పెట్టారు. బయటి వ్యక్తులతో మాట్లాడనీయలేదు. కొన్ని పత్రాలపై సంతకాలు చేయాలని పదే పదే ఒత్తిడి తీసుకొచ్చారు.

కొందరు ఖాతాదారుల ఒరిజినల్‌ డాక్యుమెంట్లు వారి వెంట తీసుకువెళ్లారు. సెక్షన్‌ 420, 409, 102బీ, 477ఏ, సెక్షన్‌ 5 ఆఫ్‌ ఈపీపీడీఎఫ్‌ఈ యాక్ట్‌, సెక్షన్‌ 76,79 ఆఫ్‌ చిట్‌ఫండ్‌ యాక్ట్‌ కింద మేనేజర్‌ రామకృష్ణను అరెస్టు చేస్తున్నట్లు ఆదివారం సాయంత్రం 4.30 గంటలకు ప్రకటించారు. కేజీహెచ్‌కు తీసుకెళ్లి వైద్యపరీక్షలు చేయించారు. విశాఖ మెట్రోపాలిటన్‌ సెషన్స్‌ కోర్టు న్యాయమూర్తి ఎం.తిరుమలరావు ముందు ఆదివారం రాత్రి 10 గంటలకు హాజరుపరచగా ఈ నెల 24 వరకు రిమాండ్‌ విధించారు. అనంతరం ఆయన్ను పోలీసులు కేంద్ర కారాగారానికి తరలించారు.

సంతకాల కోసం బెదిరింపులు

గుంటూరులోని అరండల్‌పేట మార్గదర్శి కార్యాలయంలో సీఐడీ బృందం సోదాలు ఆదివారం మధ్యాహ్నం వరకు కొనసాగాయి. అనంతరం బ్రాంచి మేనేజర్‌ శివరామకృష్ణను సీఐడీ అధికారులు తమ ప్రాంతీయ కార్యాలయానికి తరలించి సాయంత్రం 6 గంటల వరకు విచారించారు. తర్వాత గుంటూరు ప్రభుత్వాసుపత్రికి తీసుకువెళ్లి కొవిడ్‌ పరీక్షలు చేయించారు. తిరిగి రాత్రి సీఐడీ కార్యాలయానికి తీసుకువెళ్లారు. మార్గదర్శి కార్యాలయంలోని 8 మంది ఉద్యోగుల పేర్లు, చిరునామాలు, సెల్‌ నంబర్లు, కులం తదితర వివరాలు నమోదు చేసుకున్నారు. మేనేజర్‌పై ఒత్తిడి తెచ్చి కొన్ని కాగితాలపై సంతకాలు తీసుకున్నట్లు సమాచారం. రాత్రి 10 గంటలు దాటాక ఆయన్ను గుంటూరు జిల్లా జడ్జి పార్థసారథి ముందు హాజరుపరిచారు. ఆయనకు రిమాండ్‌ విధించడానికి నిరాకరించిన న్యాయమూర్తి బెయిల్‌పై విడుదల చేసి, 41ఏ నోటీసు ఇచ్చి విచారించాలని ఆదేశించారు.

రెండో రోజు అదే తరహా

రాజమహేంద్రవరంలోని మార్గదర్శి ప్రధాన కార్యాలయంలో రెండోరోజు ఆదివారమూ సోదాలు సాగాయి. మేనేజర్‌, ఇతర సిబ్బందిని పలు రకాలుగా ప్రశ్నించారు. ఆదివారం కూడా ఖాతాదారులను రానివ్వకుండా బలవంతంగా వెనక్కు పంపేశారు. ఏళ్ల తరబడి ఇక్కడ చీటీలు కడుతున్నామని, తమను ఇబ్బంది పెట్టడం ఎంతవరకు సమంజసమని కొందరు ఖాతాదారులు సీఐడీ అధికారులను ప్రశ్నించారు. మిమ్మల్ని అరెస్టు చేస్తున్నామంటూ సాయంత్రం 4 గంటల సమయంలో మేనేజర్‌ రవిశంకర్‌కు నోటీసులు అందజేశారు. 4.40 గంటలకు రాజమహేంద్రవరం ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లి వైద్య పరీక్షలు చేయించారు. ఆదివారం రాత్రి 12 గంటల సమయంలో ఆయన్ను రాజమహేంద్రవరం ఎస్సీ, ఎస్టీ కోర్టు ప్రత్యేక న్యాయమూర్తి ఎం.నాగేశ్వరరావు ముందు హాజరుపరిచారు. న్యాయమూర్తి ఈ కేసును కాకినాడ రెండో అదనపు జ్యుడిషియల్‌ ఫస్ట్‌క్లాస్‌ మేజిస్ట్రేట్‌ కోర్టుకు బదిలీ చేశారు. దీంతో రవిశంకర్‌ను రాజమహేంద్రవరంలోని సీఐడీ కార్యాలయానికి తరలించారు.

నరసరావుపేటలోనూ..

పల్నాడు జిల్లా నరసరావుపేటలోని నెల్లూరి నాగయ్య కాంప్లెక్స్‌లోని మార్గదర్శి కార్యాలయంలో ఆదివారమూ సోదాలు నిర్వహించారు. ఉద్యోగులు ఎవరెవరు వచ్చారో ఆరా తీశారు. రానివారిని ఎందుకు రాలేదని నిలదీశారు. కార్యాలయ ఉద్యోగి మధును చిట్‌ సభ్యుల ఇళ్లు చూపాలి.. వెంట రమ్మన్నారు. కోరిన వివరాలన్నీ ఇస్తున్నామని, ఖాతాదారుల ఇళ్లకు రాలేమని వారు బదులిచ్చారు. నరసరావుపేట, అనంతపురంలలో అధికారులు కొందరు ఖాతాదారులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. మార్గదర్శితో తమకు ఎలాంటి ఇబ్బందులూ లేవని వారు సమాధానమిచ్చారు.

మహిళల విధుల సమయం ముగిసినా..

ఏలూరు మార్గదర్శి కార్యాలయంలో ఆదివారం ఉదయం 9.30 గంటల నుంచి సీఐడీ, ఇంటెలిజెన్స్‌, స్టాంపులు, రిజిస్ట్రేషన్‌ అధికారుల సోదాలు కొనసాగించారు. ఉదయం నుంచి డిప్యూటీ మేనేజర్‌, అకౌంటెంట్లను దస్త్రాలు, లావాదేవీల గురించి ప్రశ్నించారు. మహిళా ఉద్యోగుల విధి నిర్వహణ సమయం ముగిసినా రాత్రి 8 గంటల వరకు వారిని కదలనివ్వలేదు. సాక్షి మీడియా ప్రతినిధులను మాత్రమే లోపలికి అనుమతించారు. తనిఖీలు చిత్రీకరించేందుకు ఆస్కారం కల్పించారు. ఇతర మీడియావారిని లోపలికి రానివ్వలేదు. తనిఖీలు పూర్తయినా కార్యాలయం తెరిచే ఉంచాలని, ముగ్గురు సిబ్బందిని ఉంచాలని ఆదేశించారు. ముగ్గురు కానిస్టేబుళ్లను అక్కడే కాపలా పెట్టారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.