రాష్ట్రంలో హిందూ ఆలయాలపై జరుగుతున్న దాడులను నిరసిస్తూ త్రిదండి చినజీయర్ స్వామి ఈనెల 17 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించనున్నారు. ఈ మేరకు వికాస తరంగిణి సంఘటన కార్యదర్శి భవానీ ప్రసాద్ ఓ ప్రకటన విడుదల చేశారు. చినజీయర్ స్వామి పర్యటనను తమ సంస్థ తరపున సమన్వయం చేయనున్నట్లు ఆయన వెల్లడించారు.
"రాష్ట్రంలో ఇటీవలి కాలంలో దాడులకు గురైన హిందూ ఆలయాలను జీయర్ స్వామి సందర్శించనున్నారు. దాడులకు గురైన దేవాలయాలను సందర్శించి..ఆలయాల రక్షణ విషయంలో తీసుకోవాల్సిన తక్షణ, దీర్ఘకాలిక చర్యలపై స్థానికులతో చర్చిస్తారు. ఆలయాల పరిరక్షణపై బాధ్యత ఉన్నవారంతా ఈ కార్యక్రమంలో భాగస్వామ్యులు కావాలని పిలుపునిచ్చారు. కొన్ని నెలలుగా ఏపీలోని అనేక దేవాలయాలపై దాడులు జరిగాయని..,విజయనగరం జిల్లా రామతీర్థంలో శ్రీరాముని విగ్రహం ధ్వంసం కావటం ఇందుకు పరాకాష్టగా జీయర్ స్వామి అభివర్ణించారు. పర్యటన ఎక్కడి నుంచి ప్రారంభం అవుతుంది..ఏయే మార్గాల్లో కొనసాగుతుందనేది ఇంకా ఖరారు కాలేదు. రెండు రోజుల్లో దీనికి సంబంధించి పూర్తి వివరాలు వెల్లడిస్తాం." -భవానీ ప్రసాద్
ఇదీచదవండి
గవర్నర్తో సీఎం జగన్ భేటీ.. విగ్రహాల ధ్వంసంపై వివరణ ఇచ్చే అవకాశం