ETV Bharat / state

పురపాలక ఎన్నికల కౌంటింగ్​పై శిక్షణ - Municipal elections news

ఎన్నికల కౌంటింగ్‌ ప్రక్రియలో పాల్గొనే సిబ్బంది ఎలాంటి పొరపాట్లకు ఆస్కారం లేకుండా అప్రమత్తంగా విధులు నిర్వహించాలని చిలకలూరిపేట పురపాలక ఎన్నికల ప్రత్యేకాధికారి డేవిడ్ రాజు ఆదేశించారు. చిలకలూరిపేట పురపాలక సంఘ ఎన్నికలకు సంబంధించి కౌంటింగ్ ప్రక్రియను ఈనెల 14వ తేదీన గణపవరం సీఆర్ ఇంజినీరింగ్ కళాశాలలో నిర్వహించనున్నారు.

chilakaluripeta municipal elections counting training
పురపాలక ఎన్నికల కౌంటింగ్​పై శిక్షణా కార్యక్రమం
author img

By

Published : Mar 13, 2021, 9:53 AM IST

గుంటూరు జిల్లా చిలకలూరిపేట పురపాలక సంఘ ఎన్నికలకు సంబంధించి కౌంటింగ్ ప్రక్రియను ఆదివారం గణపవరం సీఆర్ ఇంజినీరింగ్ కళాశాలలో నిర్వహించనున్నారు. కౌంటింగ్ నిర్వహణకు సంబంధించి ఏర్పాట్లు పూర్తి చేసిన సూపర్​వైజర్లు... సిబ్బందికి శుక్రవారం శిక్షణ నిర్వహించారు. చిలకలూరిపేట పురపాలక ఎన్నికల ప్రత్యేక అధికారి డేవిడ్ రాజు, సహాయ ఎన్నికల అధికారి, మున్సిపల్ కమిషనర్ రవీంద్ర పాల్గొన్నారు.

అయితే.. పురపాలక సంఘంలో కొత్తగా విలీనమై ఎన్నికలు జరిగిన గణపవరం, పసుమర్రు గ్రామాలకు సంబంధించి హైకోర్టులో కేసు నడుస్తున్నందున తుది తీర్పునకు లోబడి ఫలితాలు ఉంటాయని... ఆ విధంగానే గెలిచిన అభ్యర్థులకు ధ్రువపత్రాలు ఇవ్వాలని హైకోర్టు సూచించింది.

నిబంధనలపై అవగాహన

ఎన్నికల కౌంటింగ్‌ ప్రక్రియలో పాల్గొనే సిబ్బంది ఎలాంటి పొరపాట్లకు ఆస్కారం లేకుండా అప్రమత్తంగా విధులు నిర్వహించాలని చిలకలూరిపేట పురపాలక ఎన్నికల ప్రత్యేకాధికారి డేవిడ్ రాజు తెలిపారు. గణపవరం సీఆర్ ఇంజినీరింగ్ కళాశాల ఆడిటోరియంలో ఎన్నికల కౌంటింగ్ విధులలో పాల్గొనే సూపర్‌వైజర్లు, అసిస్టెంట్లకు శుక్రవారం నిర్వహించిన శిక్షణా కార్యక్రమంలో మాట్లాడారు. ఈ సందర్భంగా డేవిడ్ రాజు కౌంటింగ్‌ సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, పాటించాల్సిన నిబంధనల గురించి అవగాహన కల్పించారు. కౌంటింగ్‌ సిబ్బంది నిష్పక్షపాతంగా వ్యవహరించాలని సూచించారు. ఉదయం 6 గంటలకు కౌంటింగ్ సిబ్బంది రిపోర్టు చేయాలన్నారు. 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభించాలని చెప్పారు.

35 వార్డులకు సంబంధించి ఒక్కో వార్డుకు మూడు కేంద్రాల్లో ఉన్న 3 బ్యాలెట్ బాక్సులు చొప్పున మొత్తం 105 టేబుళ్లు ఏర్పాటు చేస్తామన్నారు. ఒకే ఒక్క రౌండ్లోనే మొత్తం ఓట్ల లెక్కింపు పూర్తవుతుందని తెలిపారు. ముందుగా పోస్టల్ బ్యాలెట్​లతోపాటు సర్వీస్ ఓట్లను లెక్కించాలని.. తరువాత బ్యాలెట్‌ బాక్సులను తెరిచే ముందు వాటికి వేసి ఉన్న సీల్‌ సక్రమంగానే ఉందని అభ్యర్థులు లేదా వారి ఏజెంట్లు నిర్ధారించు కోనివ్వాలని సూపర్‌వైజర్లకు సూచించారు. బాక్సులో ఉన్న ఓట్లు, పీఓ షీట్​లో నమోదు చేసిన ఓట్ల వివరాలు సరిపోల్చుకోవాలని సూచించారు. ఏ కేంద్రం బాక్సులోని బ్యాలెట్ పేపర్లను ఆయా కేంద్రాల వారీగా బయటకు తీసి 25 బ్యాలెట్‌ పేపర్‌ల చొప్పున ఒక కట్టగా కట్టాలన్నారు.

ఇలా అన్ని బ్యాలెట్‌ పేపర్‌లను కట్టలుగా కట్టి మూడు బాక్సులకు సంబంధించి మొత్తం కట్టలను డ్రమ్ములో వేసి కౌంటింగ్‌ టేబుల్‌ వద్దకు చేర్చాల్సి ఉంటుందన్నారు. అనంతరం కౌంటింగ్ ప్రారంభించి అభ్యర్ధుల వారీగా వచ్చిన ఓట్లను వారి ఏజెంట్లకు చూపి లెక్కించాలని చెప్పారు. కౌంటింగ్‌ ప్రక్రియలో ఎలాంటి పొరపాట్లు జరగకుండా పర్యవేక్షించాల్సిన బాధ్యత కౌంటింగ్‌ సూపర్‌వైజర్లపై ఉందని తెలిపారు. కౌంటింగ్ కేంద్రంలోనికి సెల్ ఫోన్ తీసుకు రావడానికి అనుమతి లేదన్నారు. రాష్ట్ర ఎన్నికల సంఘం సూచించిన నియమ నిబంధనలు పాటించాలని స్పష్టం చేశారు.

ఇదీ చదవండి:

గ్రామ వాలంటీర్‌ను హత్య చేసిన దుండగులు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.