ETV Bharat / state

2 మైళ్ల దూరం.. 70 కిలోమీటర్ల ప్రయాణం - కృష్ణా జిల్లా చెవిటికల్లు

అధికారుల అనాలోచిత నిర్ణయంతో 2 జిల్లాల ప్రజలు తీవ్ర ఇక్కట్లు పడుతున్నారు. మూడున్నర కిలోమీటర్ల దూరంలో ఉన్న ఊరిని 70 కిలోమీటర్లు ప్రయాణం చేసి చేరుకోవలసిన పరిస్థితి నెలకొంది. నదిపై వంతెన కడితే కష్టాలు తీరుతాయని పెట్టుకున్న మొర ఆలకించే అధికారే కరవై ఇప్పుడు ప్రమాదకర ప్రయాణం చేస్తున్నారు.

2 మైళ్ల దూరానికి 70 కిలోమీటర్ల ప్రయాణం
author img

By

Published : May 8, 2019, 4:29 PM IST

2 మైళ్ల దూరానికి 70 కిలోమీటర్ల ప్రయాణం

కృష్ణా జిల్లా చెవిటికల్లు, గుంటూరు జిల్లా అమరావతి మధ్య నది ప్రయాణం కేవలం మూడున్నర కిలోమీటర్లే. దశాబ్దాలుగా ఈ దారిలోనే పడవల ద్వారా 2 జిల్లాల ప్రజలు రాకపోకలు సాగించేవారు. ఇబ్రహీంపట్నం సంగమం దగ్గర జరిగిన ప్రమాదంతో ఈ తోవలోనూ అధికారులు పడవలను అనుమతివ్వడం లేదు. ఫలితంగా చెవిటికల్లు నుంచి అమరావతి వెళ్లాలంటే బస్సులను ఆశ్రయించాల్సి వస్తోంది. మూడున్నర కిలోమీటర్ల దూరంలో ఉండే ఊరికి 70 కిలోమీటర్లు ప్రయాణించి చేరుకోవలసి ఉంటోంది. సమయం వృథాతోపాటు చార్జీల మోత మోయాల్సి వస్తోంది.

ఈ మార్గానికే అలవాటు పడిన ప్రజలు... పడవల్లేకున్నా ప్రత్యామ్నాయాలతో ఈ మార్గంలోనే రాకపోకలు సాగిస్తున్నారు. కొంత దూరం నడచి, మరికొంత దూరాన్ని ట్రాక్టర్ల ద్వారా చేరుకుంటున్నారు. కృష్ణానదిలో ప్రవాహం తక్కువ ఉన్నప్పుడు ఇక్కట్లు ఉండవు... ఉద్ధృతి పెరిగితే మాత్రం ప్రమాదాల బారిన పడుతున్నారు. నది తీరం నుంచి ఇసుక అక్రమ రవాణా మరింత భయపెడుతోంది. ఇప్పటికైనా అధికారులు స్పందించి కష్టాల నుంచి గట్టెక్కించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

Intro:Ap_Nlr_01_08_Raithula_Nirasana_Kiran_Avbb_C1

రెండు దశాబ్దాలకు పైగా సాగు చేసుకుంటున్న తమ పొలాలను అటవీ అధికారులు తమవంటూ లాక్కుంటున్నారని నెల్లూరు జిల్లా దగదర్తి మండలంలొని నారాయణపురం గ్రామ రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమకు న్యాయం చేయాలని కోరుతూ గ్రామ రైతులు జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట నిరసన వ్యక్తం చేశారు. 1997లో 162 ఎకరాలు, 2013 లో 149 ఎకరాలను ప్రభుత్వం 250 మంది రైతులకు పంపిణీ చేసిందన్నారు. అప్పటి నుంచి తాము బ్యాంకు రుణాలను సైతం తీసుకుని పంట సాగు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నామని వారు చెబుతున్నారు. ప్రస్తుతం అటవీ అధికారులు వచ్చే ఈ భూమి తమకంటూ సర్వే రాళ్లు పాతుతూ, తమ పొలాలను బలవంతంగా లాక్కుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వ్యవసాయం పైనే ఆధారపడి జీవిస్తున్న తమ పొలాలు లాక్కుంటే ఎలా జీవించాలని వారు వాపోతున్నారు. ఉన్నతాధికారులు స్పందించి న్యాయం చేయకుంటే తమకు ఆత్మహత్యలే శరణ్యమని అంటున్నారు.
బైట్: వెంకయ్య, రైతు, నారాయణపురం.
సునీత, రైతు, నారాయణపురం.

Body:కిరణ్ ఈటీవీ భారత్

Conclusion:9394450291
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.