ETV Bharat / state

రైతు సంక్షేమమే ధ్యేయంగా ఎన్టీఆర్‌ పరిపాలన: చంద్రబాబు - చంద్రబాబు వార్తలు

రైతు సంక్షేమమే ధ్యేయంగా ఎన్టీఆర్‌ పరిపాలన చేశారని తెదేపా అధినేత చంద్రబాబు అన్నారు. ఎన్టీఆర్ 25వ వర్ధంతి సందర్బంగా.. గుంటూరు జిల్లా మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు.

chandrababu participates in death anniversary ceremony of ntr at mangalgiri
రైతు సంక్షేమమే ధ్యేయంగా ఎన్టీఆర్‌ పరిపాలన: చంద్రబాబు
author img

By

Published : Jan 18, 2021, 12:59 PM IST

Updated : Jan 18, 2021, 1:06 PM IST

రైతు సంక్షేమమే ధ్యేయంగా ఎన్టీఆర్‌ పరిపాలన: చంద్రబాబు

సినీ, రాజకీయ రంగాల్లో ఎన్టీఆర్‌కు ఎవరూ పోటీలేరని.. ఇంకెవరూ రాలేరని తెలుగుదేశం అధినేత చంద్రబాబు అన్నారు. మంగళగిరి తెదేపా కార్యాలయంలో ఎన్టీఆర్‌ వర్ధంతి కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఎన్టీఆర్ విగ్రహానికి చంద్రబాబు నివాళులర్పించారు. సంక్షేమ పథకాలకు నాంది పలికిన మహనీయుడు ఎన్టీఆర్ అని చంద్రబాబు కొనియాడారు.

ఎన్టీఆర్‌కు భారతరత్న ఇచ్చేవరకు పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. ఆర్థిక అసమానతలు తగ్గించి పేదల సంక్షేమానికి ఎన్టీఆర్ నాంది పలికారని.. వెనుకబడిన వర్గాలకు ప్రత్యేక ప్రాధాన్యత ఇచ్చారని తెలిపారు. సంపద సృష్టించి.. పేదవాళ్లకు సంక్షేమ పథకాల కింద ఇచ్చారని గుర్తుచేశారు. ఎన్టీఆర్ వ్యక్తి కాదు, వ్యవస్థ అని చంద్రబాబు అన్నారు.

ఇదీ చదవండి:

సంక్షేమ పాలనకు ఆద్యుడు ఎన్టీఆర్: చంద్రబాబు

Last Updated : Jan 18, 2021, 1:06 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.