ETV Bharat / state

వైకాపా ప్రభుత్వంపై ప్రజల్లో రోజురోజుకు వ్యతిరేకత పెరుగుతోంది: చంద్రబాబు - చంద్రబాబు నాయుడు తాజా వ్యాఖ్యలు

Chandrababu Naidu Sensational Comments On Cm Jagan Mohan Reddy: వైఎస్ జగన్మోహన్ రెడ్డి మూడున్నరేళ్ల పరిపాలనలో.. రాష్ట్రంలో ప్రజలు విసురు చెందారని తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు ఆరోపించారు.. అందుకనే రాబోయే ఎన్నికల్లో ఓడిపోతామేమోనని జగన్​కు ఇప్పటికే భయం పట్టుకోందని.. అందుకే ఎప్పడెప్పడానని ముందస్థు ఎన్నికలకు వెళ్తామని ఆలోచిస్తున్నారని ఎద్దేవా చేశారు..

Chandrababu Naidu
చంద్రబాబు నాయుడు
author img

By

Published : Dec 14, 2022, 7:59 PM IST

Chandrababu Sensational Comments On Cm Jagan: ముఖ్యమంత్రి జగన్‌రెడ్డికి ఓటమి భయం పట్టుకుందని తెలుగుదేశం అధినేత చంద్రబాబు అన్నారు. ఎన్నికలు ఎప్పుడు జరిగినా వైసీపీ చిత్తుగా ఓడిపోవడం.. వందకు వెయ్యి శాతం ఖాయమని చెప్పారు. ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి కార్యక్రమంపై పార్టీ నేతలతో చంద్రబాబు సమీక్ష నిర్వహించిన చంద్రబాబు.. రోజురోజుకూ ప్రజల్లో ప్రభుత్వంపై వ్యతిరేకత పెరుగుతుందన్నారు. ఈ విషయం జగన్ రెడ్డికి అర్థమైందని..అందుకే ముందస్తు ఎన్నికలకు వెళ్లే ఆలోచన కూడా చేస్తున్నారని చంద్రబాబు చెప్పారు.

2023 మేలో ఎన్నికలకు వెళ్లాలా,.. అక్టోబర్‌లోలో వెళ్లాలా.. లేక 2024 వరకు ఆగాలా అనే ఆలోచనలో జగన్‌ పడ్డారన్నారు. అన్ని వర్గాల ప్రజలు ఇదేం ఖర్మ అంటూ బయటకు వచ్చి తమ సమస్యలపై చర్చిస్తున్నారని..రివర్స్ పాలనపై నేడు యావత్‌ రాష్ట్రం అవేదన చెందుతోందని పార్టీ నేతలతో అన్నారు.

13వ తేదీ వచ్చినా ఉద్యోగులకు జీతాలు కూడా ఇవ్వలేని దుస్థితిలో ప్రభుత్వం ఉందని మండిపడ్డారు. ధాన్యం రైతులు నరకం చూస్తున్నా.. ప్రభుత్వానికి పట్టడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ విధానాలతో అటు రాష్ట్రం..ఇటు ప్రజలు వ్యక్తిగతంగా అప్పుల పాలయ్యారని చెప్పారు. జగన్‌ పాలనలో నష్టపోయిన వారందరికీ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే న్యాయం చేస్తామని చంద్రబాబు తెలిపారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.