ETV Bharat / state

Chandrababu Criticized CM Jagan in Sand Mining: "సంక్షేమానికి కేరాఫ్​ అడ్రస్​ తెలుగు దేశమే.. ప్రజాస్వామ్యానికి పనికి రాని వ్యక్తి జగన్"

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Aug 26, 2023, 8:00 PM IST

Updated : Aug 27, 2023, 6:24 AM IST

Chandrababu Criticized CM Jagan in Sand Mining: టీడీపీ అధినేత చంద్రబాబు సీఎం జగన్​పై విమర్శల వర్షం గుప్పించారు. రాష్ట్ర ప్రజలు వైసీపీ ప్రభుత్వంపై నమ్మకం కోల్పోయారని.. బైబై జగన్​ అనేది ప్రతి ఒక్కరి నినాదం కావాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. వైసీపీ అరాచాకలను అరిగట్టడం టీడీపీతోనే సాధ్యమని స్పష్టం చేశారు.

Chandrababu_Criticized_CM_Jagan_in_Sand_Mining
Chandrababu_Criticized_CM_Jagan_in_Sand_Mining
Chandrababu Criticized CM Jagan in Sand Mining: "సంక్షేమానికి కేరాఫ్​ అడ్రస్​ తెలుగు దేశమే.. ప్రజాస్వామ్యానికి పనికి రాని వ్యక్తి జగన్"

Chandrababu Criticized CM Jagan in Sand Mining: సీఎం జగన్​ను ఇంకా భరించలేమని.. బైబై జగన్​ అనేది ప్రతి ఒక్కరి నినాదం కావాలని టీడీపీ అధినేత చంద్రబాబు పిలుపునిచ్చారు. టీడీపీ రాష్ట్ర సమన్వయ కమిటీ సమావేశాన్ని మంగళగిరిలో నిర్వహించగా.. సమావేశంలో పాల్గొన్న టీడీపీ అధినేత పార్టీ శ్రేణులకు, నాయకులకు దిశానిర్దేశం చేశారు. ఇసుక దోపిడికి వ్యతిరేకంగా ఇసుక సత్యగ్రహం పేరుతో.. ఈనెల 28 నుంచి ఆందోళన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు ప్రకటించారు. ఇసుకపై జగన్​ ఆధిపత్యం ఎంటనీ ప్రశ్నించారు. జగన్, పెద్జిరెడ్డి, జే-గ్యాంగ్ కలిసి 40 వేల కోట్ల రూపాయల విలువైన ఇసుకను దోచేశారని చంద్రబాబు ఆరోపించారు.

వైసీపీ ప్రభుత్వం అబద్దాలు చెప్తోంది: వైసీపీ ప్రభుత్వం 90శాతం హామీలను అమలు చేశామని అబద్దాలు చెప్తోందని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యుత్​ ఛార్జీలను ప్రభుత్వం విపరీతంగా పెంచిందని విమర్శించారు. దాదాపు 50 వేల కోట్ల రూపాయల విద్యుత్ భారం ప్రజలపై మోపారని ఆక్షేపించారు. ఉచిత విద్యుత్​ విషయంలోనూ రైతులను ఇబ్బందులకు గురిచేశారని మండిపడ్డారు. ఇన్ని తప్పులు చేసిన జగన్​ ప్రభుత్వానికి ప్రజలు రుణపడి ఉండాలా అని దుయ్యబట్టారు. ప్రజాస్వామ్యానికి పనికి రాని వ్యక్తి జగన్ అని విమర్శించారు. సంక్షేమానికి కేరాఫ్​ అడ్రస్​ తెలుగు దేశమేనని స్పష్టం చేశారు. సంక్షేమంతో పాటు అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు

TDP Chief Chandrababu Chitchat "రాబోయే రోజుల్లో టీడీపీ ప్రభంజనం ఖాయం".. విలేకరులతో చంద్రబాబు ఇష్టాగోష్టి

పుంగనూరు, అంగళ్లు బాధితులను గుండెల్లో పెట్టుకుంటాము: పుంగనూరు, అంగళ్లు ఘటనల్లో బాధితులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని టీడీపీ అధినేత ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటనల వల్ల 92మంది కుటుంబాలు ఎన్నో బాధలను అనుభవిస్తున్నాయని అన్నారు. ఆ కుటుంబాలకు టీడీపీ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. వారిని గుండెల్లో పెట్టుకుంటామని హామీ ఇచ్చారు.

అక్రమాలకు పాల్పడిన వారికి టీడీపీ బోర్డులో స్థానం: మద్యం స్కాంలో హస్తం ఉన్న వ్యక్తికి టీటీడీ బోర్డులో సభ్యునిగా స్థానం కల్పించటంపై చంద్రబాబు మండిపడ్డారు. అప్రూవర్​గా మారడం అంటే.. తప్పు చేశానని ఒప్పుకోవడమేనని అన్నారు. అలా అప్రూవర్​గా మారిన వ్యక్తికి టీటీడీ బోర్డులో ఎలా స్థానం కల్పిస్తారని ప్రశ్నించారు. టీటీడీ సభ్యుల నియామకం సహా ముఖ్యమంత్రి జగన్ చేస్తున్న అన్ని తప్పిదాలను ప్రజలకు వివరించాలని టీడీపీ శ్రేణులకు పిలుపునిచ్చారు.

TDP State Committee Meeting వచ్చే ఎన్నికల్లో సత్తా చాటేందుకు సిద్ధమవుతున్న టీడీపీ.. చంద్రబాబు అధ్యక్షతన నేడు సమావేశం

సీఎం జగన్​ను రాష్ట్ర ప్రజలు భరించే పరిస్థితిలో లేరు: వైసీపీ పతనమే దేవుడు తిరగరాసిన స్క్రిప్ట్ అని తెలుగుదేశం అధినేత చంద్రబాబు స్పష్టం చేశారు. వైసీపీ ఇకపై రాష్ట్రంలో కోలుకోవటం కష్టమేనని అభిప్రాయం వ్యక్తం చేశారు. శిశుపాలుడు వంద తప్పులు చేస్తే, జగన్ లక్షల సంఖ్యలో తప్పులు చేశాడని విమర్శించారు. సీఎం జగన్​ను రాష్ట్ర ప్రజలు భరించే పరిస్థితిలో లేరని చంద్రబాబు వ్యాఖ్యనించారు. ప్రజా వేదిక పేరుతో నియోజకవర్గాల్లో పాదయాత్రలు నిర్వహించాలని టీడీపీ నాయకులకు చంద్రబాబు సూచించారు.

ప్రజలు డబ్బులు కాదని టీడీపీకే పట్టం కాట్టారు: తెలుగుదేశం నిర్వహించనున్న కార్యక్రమాలతోనే వైసీపీ ఆగడాలని అరికట్టగలుగుతామని చంద్రబాబు తెలిపారు. ముఖ్యమంత్రి జగన్​ ప్రజల్లో బలం కోల్పోయారని.. అన్నివర్గాల ప్రజలు టీడీపీకే మద్దతిస్తున్నారని అన్నారు. ఎప్పుడూ విజయం సాధించని పంచాయతీలనూ.. ఇటీవల జరిగిన ఉపఎన్నికల్లో గెలుపొందినట్లు సంతోషం వ్యక్తం చేశారు. దీనిని బట్టి రానున్న ఎన్నికల్లో వైసీపీ ఓటమిపాలవటం ఖాయమనే విషయం అర్థమవుతోందని అభిప్రాయపడ్డారు. ప్రజలు డబ్బులను కాదనీ.. టీడీపీకే పట్టం కాట్టారని వివరించారు.

"ప్రజలు వాస్తవాలు తెలుసుకున్న తర్వాత వైసీపీ ప్రభుత్వంపై తీవ్రమైన వ్యతిరేకత వచ్చే పరిస్థితి నెలకొంది. సీఎం జగన్​ స్క్రిప్ట్​ తిరగరాశాడు. అలా తిరగరాయటమే వైసీపీ పతనానికి కారణం. నా రాజకీయ జీవితంలో ఇంతా పనికిమాలిన, దద్దమ్మ ప్రభుత్వాన్ని నేనింత వరకు చూడలేదు. రానున్న ఎన్నికల్లో వైసీపీ చిత్తుచిత్తుగా ఓడిపోవటం ఖాయం. రాష్ట్ర ప్రజానీకం ముఖ్యమంత్రి జగన్​ను భరించే పరిస్థితిలో లేరు." - చంద్రబాబు

Chandrababu Fires on CM Jagan: వైసీపీ అక్రమాలపై చంద్రబాబు ఆగ్రహం.. ఇసుక దోపిడీపై సమాధానం చెప్పాలని డిమాండ్​

Last Updated : Aug 27, 2023, 6:24 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.